ఉత్సాహంగా ‘మహిళా మారథాన్‌’ | - | Sakshi
Sakshi News home page

ఉత్సాహంగా ‘మహిళా మారథాన్‌’

Published Wed, Mar 15 2023 5:40 AM | Last Updated on Wed, Mar 15 2023 5:40 AM

- - Sakshi

మీర్‌పేట: మహిళా వారోత్సవాల్లో భాగంగా చివరి రోజు మంగళవారం కార్పొరేషన్‌ కమిషనర్‌ సీహెచ్‌ నాగేశ్వర్‌ ఆధ్వర్యంలో ‘మహిళా మారథాన్‌’ ఉత్సాహంగా సాగింది. మీర్‌పేట లోని బురుజు నుంచి కార్పొరేషన్‌ కార్యాలయం వరకు నిర్వహించిన ర్యాలీలో మేయర్‌ ఎం.దుర్గాదీప్‌లాల్‌, మహిళా కార్పొరేటర్లు, సిబ్బంది, ఆర్‌పీలు పాల్గొన్నారు. అనంతరం వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన రంగవల్లులు, క్రీడలు, ఆటలు, వంటల పోటీల్లో ప్రతిభ కనబరిచిన మహిళలకు మేయర్‌ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. కార్యక్ర మంలో మేనేజర్‌ వెంకట్‌రెడ్డి, ఆర్‌ఓ అంజన్‌రెడ్డి, కార్పొరేటర్లు అక్కి మాధవి, ధరంకార్‌ జ్యోతి, తీగల మాధవి, గోవర్ధన్‌రెడ్డి, రాంచందర్‌, ముత్తంగి కరుణానిధి, గౌరీ శంకర్‌, భీంరాజ్‌, ఇంద్రావత్‌ రవినాయక్‌ పాల్గొన్నారు.

ఆత్మరక్షణకు

కరాటే దోహదం

షాద్‌నగర్‌: ఆత్మరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కరాటే నేర్చుకోవాలని తెలంగాణ స్కూల్‌ స్పోర్ట్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎత్తిన చెన్నయ్య అన్నారు. బాలికల దినోత్సవం ముగింపు సందర్భంగా మంగళవారం షాద్‌నగర్‌ పట్టణంలోని ఉర్దూ మీడియం పాఠశాల లో, కందివనంలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థినులకు కరాటే, జూడో శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళలు, యువతులు, విద్యార్థినులు స్వీయ రక్షణ కోసం తప్పనిసరిగా యుద్ధ విద్యలను నేర్చుకోవాలన్నారు. కార్యక్రమాల్లో ఆయా పాఠశాలల హెచ్‌ఎంలు మల్లేశ్‌, గుడికాడి ఆంజనేయులు, ఉపాధ్యాయులు, పాల్గొన్నారు.

దరఖాస్తుల ఆహ్వానం

మొయినాబాద్‌రూరల్‌: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 5వ తరగతిలో ప్రవేశం కోసం ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలంగాణ సాంఘిక సంక్షేమ చేవెళ్ల గురుకుల పాఠశాల, కళాశాల ప్రిన్సిపాల్‌ రమాదేవి తెలిపారు. మంగళవారం ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థల్లో 2023–24 విద్యా సంవత్సరానికి 5వ తరగతిలో ప్రవేశ పరీక్ష కోసం ఇంగ్లిష్‌ మీడియంలో చేరేందుకు 4వ తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 16వ తేదీ వరకు గుడువు పొడిగించినట్లు చెప్పారు. ఈ లోపు రూ.వంద రుసుము చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

శంకర్‌పల్లి గురుకులంలో..

మొయినాబాద్‌: సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 5వ తరగతిలో ప్రవేశానికి ఈ నెల 16లోగా దరఖాస్తు చేసుకోవాలని మొయినాబాద్‌లోని శంకర్‌పల్లి గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్‌ జయమ్మ మంగళవారం ఒక ప్రకటనలో కోరారు. ప్రస్తుతం 4వ తరగతి చదువుతున్న విద్యార్థులు వీటీజీ సెట్‌ ప్రవేశ పరీక్ష రాసేందుకు అర్హులన్నారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు 16వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

రేపటి వరకు గడువు

ఇబ్రహీంపట్నం: గురుకుల విద్యాలయాల్లో 5వ తరగతి ప్రవేశాలకు గురువారం వరకు గడువు ఉందని స్థానిక టీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్‌ ప్రిన్సిపాల్‌ సత్యనారాయణ పేర్కొన్నారు. అసక్తిగల విద్యార్థులు టీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్‌ వెబ్‌ పోర్టల్‌కు వెళ్లి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆ తర్వాత రాత పరీక్ష నిర్వహించి ఎంపిక చేస్తారని తెలిపారు.

పగటి పూట ఎండ.. రాత్రి వేళ ఠండా

సాక్షి, సిటీబ్యూరో: పగటిపూట ఎండలు మండుతున్నాయి. రాత్రి వేళ చలి వణికిస్తోంది. వారం రోజులుగా పగటి పూట ఉష్ణోగత పెరుగుతున్నా.. రాత్రివేళ సాధారణ కనిష్ట ఉష్ణోగత మైనస్‌లో పడిపోతోంది. ఫలితంగా చలి వాతావరణం పునరావృతమవుతోంది.మంగళవారం గరిష్ట ఉష్ణోగ్రత 34.6.. కనిష్ట ఉష్ణోగ్రత 19.1 డిగ్రీలుగా నమోదయ్యాయి. సాధారణం కంటే 2 డిగ్రీలు తక్కువ కావడంతో చలి ప్రభావం కనిపిస్తోంది. మరోవైపు రాష్ట్రంలో ద్రోణి ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతా వరణ శాఖ వెల్లడించింది. పగటి పూట ఎండలు, సాయంత్రానికి వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
ర్యాలీలో పాల్గొన్న మహిళలు 1
1/1

ర్యాలీలో పాల్గొన్న మహిళలు

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement