షాబాద్: సర్దార్‌నగర్ తైబజార్ వేలం పాట రూ.42.10 లక్షలు పలికినట్లు ఎంపీఓ హన్మంత్‌రెడ్డి, పంచాయతీ కార్యదర్శి మధుసూదన్‌రెడ్డి తెలిపారు. మండల పరిధిలోని సర్దర్‌నగర్ పంచాయతీ కార్యాలయంలో గురువారం సర్పంచ్ మునగపాటి స్వరూప ఆధ్వర్యంలో వేలం పాట నిర్వహించారు. వేలం పాటలో మొత్తం 9 మంది పాల్గొన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధర రూ. 26.51 లక్షలు ఉండగా కుర్వగూడ గ్రామానికి చెందిన ర్యాకల మల్లేశ్ రూ.42.10 లక్షలకు దక్కించుకున్నారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ ఇంద్రమ్మ, మాజీ సర్పంచ్ నర్సింహులు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
పంట పొలాల పరిశీలన
కేశంపేట: యాసంగిలో రైతులు వ్యవసాయ అధికారుల సూచనలు పాటించాలని జిల్లా వ్యవసాయ అధికారి గీతారెడ్డి అన్నారు. కొత్తపేట రైతువేదిక క్లస్టర్‌లోని వ్యవసాయ పొలాల్లో గురువారం ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అకాల వర్షాలతో జాగ్రత్తలు పాటించాలన్నారు. వ్యవసాయ అధికారుల సూచనలు పాటిస్తూ రైతులు అధిక దిగుబడి సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ విస్తరణ అధికారి రాము, రైతులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment