టస్మో జిల్లా అధ్యక్షుడిగా రాజశేఖర్‌ | - | Sakshi
Sakshi News home page

టస్మో జిల్లా అధ్యక్షుడిగా రాజశేఖర్‌

Published Mon, Apr 10 2023 5:00 AM | Last Updated on Mon, Apr 10 2023 5:00 AM

- - Sakshi

ఇబ్రహీంపట్నం రూరల్‌: టైగర్‌ ఆల్‌ స్టయిల్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ ఆర్గనైజేషన్‌ (టస్మో) ఇండియా జిల్లా అధ్యక్షుడిగా చింతపల్లిగూడ గ్రామానికి చెందిన జోగు రాజశేఖర్‌ నియమితులయ్యా రు. ఈమేరకు ఆదివారం నగరంలో రాష్ట్ర అధ్యక్షుడు చందర్‌రావు చేతుల మీదుగా నియామకపత్రం అందుకున్నారు. ఈ సందర్భంగా జోగు రాజశేఖర్‌ మాట్లాడుతూ.. మార్షల్‌ ఆర్ట్స్‌ హక్కుల సాధనకు కృషి చేస్తానని అన్నారు. జిల్లాలో ఉన్న అన్ని సంఘాలను ఏకతాటిపైకి తీసుకొచ్చి సంఘటితం చేస్తామ న్నారు. తనపై నమ్మకంతో ఈ బాధ్యత అప్పగించిన సంఘం పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు.

ఉత్సాహంగా కిడ్నీ వాక్‌

రాయదుర్గం: కిడ్నీ వాకథాన్‌తో పాటు రన్‌లో ఔత్సాహికులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌ ప్రాంతంలోని స్టార్‌ ఆస్పత్రి ఆధ్వర్యంలో కిడ్నీ సంరక్షణ కోసం 5 కిలోమీటర్ల వాకథాన్‌, రన్‌ను ఆదివారం ఉదయం నిర్వహించారు. వాకథాన్‌, రన్‌లో కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్‌ సర్వైవర్స్‌తో పాటు వెయ్యి మంది ఉల్లాసంగా పాల్గొనడం విశేషం. చిన్నారులతో పాటు శతాధిక వృద్ధుడు అప్పసాని శేషగిరిరావు కూడా ఉల్లాసంగా వాకథాన్‌లో పాల్గొనడం మరో విశేషం. కార్యక్రమంలో స్టార్‌ ఆస్పత్రి మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ గోపీచంద్‌ మన్నం, జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రమేష్‌ గూడపాటి, రిటైర్డ్‌ డీసీపీ భద్రీనాథ్‌, తెల్లాపూర్‌ నైబర్‌హుడ్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు రమణ, ఈశ్వరగిరి, డాక్టర్‌ గందెశ్రీధర్‌, సీనియర్‌ కన్సల్టెంట్‌ నెఫ్రాలజిస్ట్‌, ట్రాన్స్‌ప్లాంట్‌ ఫిజీషియన్‌ విభాగాల వైద్యులు పాల్గొన్నారు.

యోగాతో పార్కిన్సన్‌ వ్యాధిగ్రస్తుల్లో మంచి ఫలితాలు

బంజారాహిల్స్‌: పార్కిన్సన్‌ వ్యాధితో బాధపడుతున్న వారికి సాధారణ వైద్యంతో పాటు యోగా, స్పీచ్‌ థెరపీలతో మంచి ఫలితాలు వస్తున్నాయని డాక్టర్‌ రుక్మిణి అన్నారు. ప్రపంచ పార్కిన్సన్‌ డే సందర్భంగా ఆదివారం పార్కిన్సన్‌ సొసైటీ ఆఫ్‌ హైదరాబాద్‌, సిటీ న్యూరో సెంటర్‌ సంయుక్తంగా బంజారాహిల్స్‌ ఎమ్మెల్యే కాలనీలోని సిటీ న్యూరో ఆస్పత్రిలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ.. ప్రతి వెయ్యి మందిలో ఒకరికి పార్కిన్సన్‌ వ్యాధి తీవ్రమవుతోందని.. వీరికి సరైన వైద్యం అందిస్తే నయమవుతుందని స్పష్టం చేశారు. యోగా, స్పీచ్‌ థెరపీలతోనూ మంచి ప్రయోజనాలు ఉంటున్నాయని తెలి పారు. పార్కిన్సన్‌ వ్యాధికి గురైన వారు ఒంటరిగా ఉండటం వల్ల మానసికస్థితి దెబ్బ తింటోందని, వీరి కోసం పార్కిన్సన్‌ సొసైటీ ఆఫ్‌ హైదరాబాద్‌ సంస్థ తోడుగా నిలుస్తోందని వెల్లడించారు. ఈ సంస్థ ద్వారా ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్‌లైన్‌లోనూ ఉచితంగా యోగా, స్పీచ్‌ థెరపీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో వైద్యులు రాజేష్‌, రూపం బోర్గే యిన్‌, సాయి దీపక్‌, శతి, సందీప్‌, ప్రసాద్‌, యోగా మాస్టర్‌ రమేష్‌, శ్రీదేవి పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
అవగాహన కల్పిస్తున్న వైద్యులు 1
1/2

అవగాహన కల్పిస్తున్న వైద్యులు

నియామకపత్రం అందుకుంటున్న రాజశేఖర్‌2
2/2

నియామకపత్రం అందుకుంటున్న రాజశేఖర్‌

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement