చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి
చేవెళ్ల: మినీ స్టేడియం అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురావాలని చేవెళ్ల ఎంపీ డాక్టర్ రంజిత్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో తన సొంత నిధులతో చేపడుతున్న మినీ స్టేడియం అభివృద్ధి పనులను బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన కాంట్రాక్టర్‌కుపలు సూచనలిచ్చారు. వాకింగ్, రన్నింగ్ ట్రాక్, వాలీబాల్, షటిల్, బాస్కెట్ బాల్ కోర్టులు ఉండేలా స్టేడియం అభివృద్ధి పనులు చేపడ్తున్నట్లు ఎంపీ వివరించారు. ఎంపీ వెంట శంకర్‌పల్లి ఎంపీపీ గోవర్ధన్‌రెడ్డి పలువురు పార్టీ నాయకులున్నారు.
కూరగాయల
సాగుతో లాభాలు
ఉద్యాన శాఖ జిల్లా అధికారి కనకలక్ష్మి
తుర్కయంజాల్: కూరగాయల సాగుతో రైతులు లాభాలు పొందవచ్చునని ఉద్యాన శా ఖ జిల్లా అధికారి కనకలక్ష్మి, సేవా స్ఫూర్తి ఫౌండేషన్ ప్రాజెక్ట్ మేనేజర్ గొల్లపెల్లి రత్నాకర్ తెలి పారు. బుధవారం మున్సిపాలిటీ పరిధిలోని మన్నెగూడలో రైతుల పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కూరగాయల సాగు లో రైతులు చేపట్టాల్సిన యాజమాన్య పద్దతులను వివరించారు. టెక్స్‌మో డ్రిప్ కంపెనీ ప్రతినిధి వెంకటేశ్, రైతులు మోహన్ రాజు, వెంకట్‌రెడ్డి, పర్వత్ రెడ్డి, రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment