ప్రభుత్వ భూమిని కాపాడండి | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ భూమిని కాపాడండి

Published Fri, Apr 21 2023 4:52 AM | Last Updated on Fri, Apr 21 2023 4:52 AM

- - Sakshi

కలెక్టర్‌కు సీపీఐ నేతల వినతి

సాక్షి, రంగారెడ్డిజిల్లా: బాలాపూర్‌ మండలం బడంగ్‌పేట్‌లోని సర్వే నంబర్‌ 119లోని ప్రభుత్వ భూమిని కబ్జాదారుల బారి నుంచి కాపాడాలని సీపీఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య కోరారు. ఈ మేరకు గురువారం కలెక్టర్‌ హరీశ్‌కు ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఆంధోజు రవీంద్రచారి, జిల్లా నాయకుడు కృష్ణతో కలిసి వినతిపత్రం అందజేశారు. పేదలకు చెందాల్సిన ప్రభుత్వ భూములను కొంత మంది స్థానిక కార్పొరేటర్లు కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. ఈ భూమిలో వెలిసిన అక్రమ నిర్మాణాలను తక్షణమే తొలగించాలని డిమాండ్‌ చేశారు. లేదంటే సీపీఐ ఆధ్వర్యంలో ఆ ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేయించడానికి వెనుకాడబోమని హెచ్చరించారు.

‘విస్తరణ’ వేగవంతం

చేయండి

ఎంపీ రంజిత్‌రెడ్డి

సాక్షి, రంగారెడ్డిజిల్లా: అప్పా నుంచి మన్నెగూడ వరకు నాలుగు లేన్ల రహదారి విస్తరణ పనులు వేగవంతం చేయాలని చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ మేరకు గురువారం కలెక్టరేట్‌లో కలెక్టర్‌ హరీశ్‌ అధ్యక్షతన స్థానిక సర్పంచులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పటికే 80 శాతం భూ సేకరణ పూర్తయిందని, మిగిలిన 20 శాతం కూడా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. భూ సేకరణ పూర్తయిన ప్రాంతంలో పనులను వేగవంతం చేయాలని కోరారు. మే 1 నుంచి పనులు ప్రారంభించి సకాలంలో పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని మెగా కాంట్రాక్టర్లకు సూచించారు. సమావేశంలో చేవెళ్ల ఆర్డీఓ వేణుగోపాల్‌, జాతీయ రహదారి అథారిటీ సంస్థ అధికారులు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

ప్రభుత్వ ఇన్సూరెన్స్‌తో లబ్ధి

జిల్లా లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ శ్రీనివాసరావు

కేశంపేట: ప్రభుత్వ ఇన్సూరెన్స్‌ పథకాలను అర్హులైన ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ శ్రీనివాసరావు అన్నారు. మండలంలోని నిర్ధవెల్లిలో గురువారం ప్రభుత్వ ఇన్సూరెన్స్‌ పథకాలపై గ్రామస్తులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మేనేజర్‌ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ప్రధానమంత్రి జీవన జ్యోతి, సురక్ష బీమా యోజన పథకాల ప్రీమియంను సకాలంలో చెల్లించాలని అన్నారు. ప్రతి సంవత్సరం ఎంపిక చేసుకున్న ప్రీమియం చెల్లించాలని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్‌ పార్వతమ్మ, ఇన్‌చార్జి ఎంపీ డీఓ రవిచంద్రకుమార్‌రెడ్డి, ఎంపీటీసీ కృష్టమ్మ, ఏపీఎం భగవంతు, భద్రప్ప, ప్రశాంత్‌రెడ్డి, పాండు తదితరులు పాల్గొన్నారు.

ఆర్టీఏకు సినీనటుడు రవితేజ

సాక్షి, సిటీబ్యూరో: ప్రముఖ సినీనటుడు రవితేజ గురువారం ఖైరతాబాద్‌ ఆర్టీఏ కార్యాలయాన్ని సందర్శించారు. ఆయన కొత్తగా కొనుగోలు చేసిన బీవైడీ కంపెనీకి చెందిన అట్టో 3 ఈవీ బ్యాటరీ కారు రిజిస్ట్రేషన్‌ కోసం వచ్చారు. విద్యుత్‌తో నడిచే ఈ కారు ఖరీదు రూ.34.49 లక్షలు. వాహనం కోసం ఆయన రూ. 17,628 చెల్లించి‘టీఎస్‌ 09జీబీ 2628 ప్రత్యేక నంబర్‌ను ఆన్‌లైన్‌ బిడ్డింగ్‌ ద్వారా సొంతం చేసుకున్నారు. నిబంధనల మేరకు ఖైరతాబాద్‌ ప్రాంతీయ రవాణా అధికారి రాంచందర్‌ వాహనం రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను పూర్తి చేశారు. బండి నమోదు కోసం రవితేజ ఫొటో దిగడంతో పాటు డిజిటల్‌ ప్యాడ్‌పై సంతకం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
మాట్లాడుతున్న లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ శ్రీనివాసరావు  
1
1/1

మాట్లాడుతున్న లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ శ్రీనివాసరావు

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement