చేవెళ్ల: స్థానిక ప్రభుత్వ డిగ్రీకళాశాలలో ఈనెల 25న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ అనురాధ ఒక ప్రకటనలో తెలిపారు. డిగ్రీ, పీజీ, ఎంబీఏ, బీటెక్ పూర్తి చేసిన అభ్యర్థులకోసం మ్యాజిక్ బస్ ఆఫ్ ఇండియా ఫౌండేషన్, టీఎస్‌కేసీ, ప్రభుత్వ డిగ్రీ కళాశాలల సంయుక్త ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. డిగ్రీ పూర్తి చేసుకున్న అభ్యర్థులు పాల్గొనవచ్చని తెలిపారు. విద్యార్హత ధ్రువీకరణ పత్రాలు, ఆధార్‌కార్డు, బయోడేటా, పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోతో రావాల్సి ఉంటుందన్నారు. ఆయా విద్యార్హతలను బట్టి ఉపాధి అవకాశాలు కల్పించటం జరుగుతుందన్నారు. వివరాలకు 91601 08844 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.
అనుమానాస్పదస్థితిలో కారు దగ్ధం
కొత్తూరు: అనుమానాస్పదస్థితిలో కారు దగ్ధమైన సంఘటన మండల పరిధిలోని మల్లాపూర్‌లో ఆదివారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ శంకర్ తెలిపిన వివరాల మేరకు మల్లాపూర్‌లోని ఓ పార్కింగ్ స్థలంలో నిలిపిన కారు దగ్ధమైందనే సమాచారంతో పోలీసులు అక్కడికి వెళ్లారు. పరిశీలనలో కారు ఇటీవల గ్రామంలో చోటు చేసుకున్న డాక్యుమెంట్ రైటర్ కరుణాకర్‌రెడ్డి హత్యకేసులో నిందితుడు విక్రమ్‌రెడ్డికి చెందినదిగా గుర్తించారు. విక్రమ్‌రెడ్డి ఇదివరకే కారును ఇతరుల నుంచి కొనుగోలు చేయగా ఇంకా తనపేరుపై రిజిస్ట్రేషన్ చేసుకోలేదు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
మోదీ పాలనలో ప్రభుత్వ రంగ సంస్థలు నిర్వీర్యం
సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు
రవీంద్రచారి
కందుకూరు: నరేంద్రమోదీ పాలనలో ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తూ కార్పొరేట్ సంస్థలకు ధారాదత్తం చేస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అందోజు రవీంద్రచారి ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ ‘మోదీకి హటావో దేశ్‌కో బచావో’ నినాదంతో పార్టీ మండల కార్యదర్శి కె.రాజు ఆధ్వర్యంలో ఆదివారం మండల పరిధిలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రవీంద్రచారి మాట్లాడుతూ.. ఆర్‌ఎస్‌ఎస్ అనుసంధానంలో మనువాద రాజ్యాంగాన్ని నిర్మించేలా ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. భారత రాజ్యాంగం అన్ని వర్గాల ప్రజలకు శ్రీరామ రక్ష, అంబేడ్కర్ ఇచ్చిన రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. తెలంగాణలో ధరణి పేరుతో అనేక భూ సమస్యలు పరిష్కారం కాకుండా రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణం ధరణిలో సమస్యలు పరిష్కారం అయ్యేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో డీహెచ్‌పీఎస్ జిల్లా అధ్యక్షుడు ఎర్ర గణేశ్, నాయకులు రాజు, అంజి, ఊట్లపల్లి రవి, నరసింహ, నవీన్, రమేష్, చెన్నయ్య, బ్రహ్మచారి, ఆదిలక్ష్మి, శ్రీకాంత్, శ్రావణి, ఉష తదితరులు పాల్గొన్నారు.
మహనీయులను
స్ఫూర్తిగా తీసుకోవాలి
ఇబ్రహీంపట్నం రూరల్: మహనీయుల స్ఫూర్తితో ముందుకు సాగాలని జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి ఉదయ్ ప్రకాష్ పేర్కొ న్నారు. మహాత్మా బసవేశ్వర 890వ జయంతి ఉత్సవాలను జిల్లా వెనకబడిన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం కలెక్టరేట్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి ఉదయ్ ప్రకాష్ మాట్లాడుతూ.. కుల, మత, లింగ, వర్ణ బేధాలకు వ్యతిరేకంగా బసవేశ్వర చేసిన కృషి ఎంతో గొప్పదని కొనియాడారు. ఆయనను విశ్వగురువుగా, గొప్ప దార్శనికుడిగా సంస్కారవాదిగా ప్రపంచం కీర్తిస్తోందని గుర్తు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment