మొయినాబాద్: ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని నిరుద్యోగ మహిళలకు ఉచిత స్వయం ఉపాధి శిక్షణ ఇవ్వనున్నట్లు ఎస్‌బీఐ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ (ఆర్‌సెటీ) డైరెక్టర్ కె.రమేష్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మండల పరిధిలోని చిలుకూరు మహి ళా ప్రాంగణం ఆవరణలో ఉన్న ఎస్‌బీఐ ఆర్‌సెటీ కేంద్రంలో టైలరింగ్, మగ్గం వర్క్స్, సెల్‌ఫోన్ రిపేరింగ్ కోర్సుల్లో నెల రోజులపాటు శిక్షణ ఇస్తామన్నారు. 19 నుంచి 45 సంవత్సరాల వయసు ఉండి పదో తరగతి పాసైన మహిళలు ఈ నెల 28 వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. దరఖాస్తుతోపాటు ఎస్‌ఎస్‌సీ మెమో, రేషన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంకు పాస్‌బుక్ జిరాక్స్ కాపీలు, నాలుగు పాస్‌పోర్ట్ సైజు ఫొటోలు జతచేయాలన్నారు. శిక్షణకా లంలో ఉచిత భోజనం, వసతి సౌకర్యంతో పాటు యూనిఫాం, టూల్ కిట్స్ ఉచితంగా అందజేస్తామన్నారు. వివరాలకు 86390 79122, 79819 51167, 90007 78300 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
సివిల్స్‌లో మెరిసిన
షాద్‌నగర్ ఆణిముత్యం
జాతీయ స్థాయిలో 384వ ర్యాంకు సాధించిన సుస్మిత
షాద్‌నగర్: దేశంలోనే అత్యున్నత సర్వీస్‌గా భావించే సివిల్ సర్వీసెస్ పరీక్షా ఫలితాల్లో జాతీయ స్థాయిలో షాద్‌నగర్ విద్యార్థిని సత్తా చాటింది. పట్టణానికి చెందిన ఇప్పలపల్లి శ్రీశైలం, లక్ష్మి దంపతుల కూతురు సుష్మిత అత్యుత్తమ ప్రతిభ కనబరిచి 384 ర్యాంకు సాధించింది. గతంలో మూడుసార్లు ఇంటర్వ్యూకు చేరుకున్న ఆమె లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. పట్టువదలకుండా నాలుగోసారి శ్రమించి మంచి ర్యాంకు సాధించింది. ఆమె పదో తరగతి వరకు షాద్‌నగర్ పట్టణంలోని హెరిటేజ్ వ్యాలీలో చదివింది. అనంతరం హైదరాబాద్‌లోని పేజ్ కళాశాలలో ఇంటర్, అండర్ గ్రాడ్యుయేషన్‌ను వరంగల్‌లోలోని నిట్‌లో పూర్తి చేసింది. పబ్లిక్ సర్వీస్‌పై ఆసక్తి పెంచుకున్న ఆమె సివిల్స్‌కు సిద్ధమైంది. నాలుగో ప్రయత్నంలో లక్ష్యాన్ని చేరుకుంది. ఈ సందర్భంగా పలువురు సుస్మితను ఘనంగా సన్మానించారు.
మాసబ్ చెరువు శిఖంలో మట్టి తొలగింపు షురూ
తుర్కయంజాల్: మాసబ్ చెరువులో మట్టి తొలగింపు పనులను ఎట్టకేలకు మంగళవారం రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్ శాఖల అధికారులు ప్రారంభించారు. చెరువు శిఖం ప్రభుత్వ సర్వే నంబర్ 137లో నక్షబాట పేరుతో రైతుల ముసుగులో రియల్ ఎస్టేట్ వ్యాపారులు పెద్ద పెద్ద బండరాళ్లు, వందల కొద్ది టిప్పర్ల మట్టిని డంప్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై శ్రీసాక్షిశ్రీలో సోమవారం మాసబ్‌పై మాఫియా శీర్షికన కథనం ప్రచురితమైంది. ఈ నేపథ్యంలో మంగళవారం మట్టి తొలగింపు పనులను ప్రారంభించినప్పటికీ అధికారులు ఏర్పాటు చేసిన జేసీబీతో పెద్ద పెద్ద బండరాళ్లను తొలగించడం సాధ్యంకాలేదు. దీంతో బుధవారం పెద్ద యంత్రాలను ఏర్పాటు చేసి తొలగింపు పనులు చేపడతామని అధికారులు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా గతంలో సర్వే నంబర్ 205లో మట్టి డంప్ చేసిన సమయంలోనూ అధికారులు పలు కారణాలతో వాయిదా వేసి, సదరు వ్యక్తులకు కోర్టులో తీర్పు అనుకూలంగా వచ్చే వరకు సహకరించారనే ఆరోపణలు ఉన్నాయి.
షూలో దాచి తెచ్చిన 1818 గ్రాముల బంగారం పట్టివేత
శంషాబాద్: అక్రమంగా తీసుకొచ్చిన బంగారాన్ని శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకు న్నా రు. రియాద్ నుంచి మంగళవారం మధ్యాహ్నం ఎక్స్‌వై 325 విమానంలో వచ్చిన ముగ్గురు ప్రయాణికుల కదలికలను అనుమానించిన అధికారులు వారిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. లగేజీల్లో ఎలాంటి వస్తువులు దొరకలేదు. వారు ధరించిన షూలను విప్పిచూడగా పాదం భాగంలో పేస్టు రూపంలో అతికించిన ఉన్న బంగారం బయటపడింది. 1818 గ్రాముల బరువు కలిగిన బంగారం విలువ రూ.1.13 లక్షల విలువ ఉంటుందని అధికారులు నిర్ధారించారు. నిందితులు ముగ్గురు కూడా ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన వారిగా గుర్తించారు.
Comments
Please login to add a commentAdd a comment