చలానా.. | - | Sakshi
Sakshi News home page

చలానా..

Published Wed, May 31 2023 3:56 AM | Last Updated on Wed, May 31 2023 3:56 AM

- - Sakshi

బుధవారం శ్రీ 31 శ్రీ మే శ్రీ 2023

8లోu

మొయినాబాద్‌కు చెందిన ఓ రియల్టర్‌ ఇటీవల ఫరూఖ్‌నగర్‌ మండలం హజీపూర్‌ రెవెన్యూ పరిధిలో 6.20 ఎకరాలు కొనుగోలు చేశాడు. ఈ మొత్తం భూమి 20 సర్వే నంబర్లలో ఉంది. మొత్తాన్ని ఒకే డాక్యుమెంట్‌పై రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని ఈ మేరకు ‘ధరణి’ పోర్టల్‌లో స్లాట్‌ బుక్‌ చేయించి, రిజిస్ట్రేషన్‌ ఫీజు రూ.4 లక్షలు మీసేవా ద్వారా చెల్లించాడు. డాక్యుమెంట్‌ సిద్ధం చేసుకుని, ముందే బుక్‌ చేసుకున్న స్లాట్‌ ప్రకారం రిజిస్ట్రేషన్‌కు వెళ్లగా సైట్‌ తెరుచుకోకపోగా గంటల తరబడి ‘బఫరింగ్‌’ అవుతోంది. చేసేది లేక అధికారుల సూచన మేరకు ఐదు సర్వే నంబర్లకు ఒక డాక్యుమెంట్‌ చొప్పున మొత్తం నాలుగు డాక్యుమెంట్లను తయారు చేయించి మళ్లీ

రిజిస్ట్రేషన్‌కు వెళ్లాడు. అంతకు ముందు ఆన్‌లైన్‌ ద్వారా చెల్లించిన రూ.4 లక్షల చలానా డబ్బులు వాపస్‌ రాకపోవడంతో మళ్లీ అంతే ఫీజు చెల్లించాల్సి వచ్చింది.

బాలాపూర్‌కు చెందిన ఓ రియల్టర్‌ మహేశ్వరంలో రెండెకరాలు కొనుగోలు చేశాడు. రిజిస్ట్రేన్‌ కోసం ధరణిలో స్లాట్‌ బుక్‌ చేసుకుని డాక్యుమెంట్‌ను సిద్ధం చేసుకున్నాడు. రిజిస్ట్రేషన్‌ ఫీజు రూ.1.40 లక్షలు డాక్యుమెంట్‌ రైటర్‌ బ్యాంక్‌ అకౌంట్‌ నుంచి ఆన్‌లైన్‌ ద్వారా చెల్లించాడు. తీరా రిజిస్ట్రేషన్‌ సమయంలో విక్రయదారుని సోదరి ఈ భూమిపై కేసు వేసింది. అనివార్య కారణాాలతో రిజిస్ట్రేషన్‌ నిలిచిపోయింది. చలానా రూపంలో ఆయన చెల్లించిన ఫీజు మాత్రం ఇప్పటికీ తిరిగి రాలేదు.

శంకర్‌పల్లికి చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగి చేవెళ్ల సమీపంలో మూడెకరాలు కొనుగోలు చేశాడు. రిజిస్ట్రేషన్‌ కోసం స్లాట్‌ బుక్‌ చేసుకుని రూ.1.30 లక్షలు చలానా రూపంలో చెల్లించాడు. తీరా ఆ భూమిని విక్రయించేందుకు యజమాని నిరాకరించడంతో రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ నిలిచిపోయింది. అప్పటికే చలానా రూపంలో చెల్లించిన సొమ్ము వెనక్కి ఇవ్వాల్సిందిగా అధికారులను అభ్యర్థించినా ఫలితం లేకపోయింది.

సాక్షి, రంగారెడ్డిజిల్లా: వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ తహసీల్దార్‌ కార్యాలయాల్లో ధరణి పోర్టల్‌ ద్వారా జరుగుతోంది. జిల్లా వ్యాప్తంగా 27 తహసీల్దార్‌ కార్యాలయాలు ఉండగా, ఒక్కో కార్యాలయంలో రోజుకు సగటున 30 నుంచి 50 రిజిస్ట్రేషన్లు జరుగుతుంటాయి. సాధారణంగా కొనుగోలుదారులు తమ భూవముుుల రిజిస్ట్రేషన్‌ కోసం ముందు ధరణిలో తమ పేరున స్లాట్‌ బుక్‌ చేసుకోవాల్సి ఉంటుంది. దస్తావేజును తయారు చేయించుకోవడంతో పాటు మార్కెట్‌ విలువ మేరకు ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్‌ ఫీజు ముందే చెల్లించాల్సి ఉంది. ఏదైనా అనివార్య కారణాలతో రిజిస్ట్రేషన్‌ నిలిచిపోతే.. అంతకు ముందే బుక్‌ చేసిన స్లాట్‌ను మరో తేదీకి వాయిదా వేసుకోవచ్చు. ఇందుకు అపరాధ రుసుం రూ. 500 నుంచి రూ.1,500 చెల్లించాల్సి ఉంది. ఒకవేళ కోర్టు కేసులు, ఇతర అభ్యంతరాలతో అర్థంతరంగా రిజిస్ట్రేషన్‌ రద్దయితే..అప్పటికే డాక్యుమెంట్‌ రైటర్‌ అకౌంట్‌ నుంచి కానీ సొంత అకౌంట్‌ నుంచి కానీ చెల్లించిన చలానా సొమ్ము రావడం లేదు.

జిల్లాలో 250 మందికిపైగా బాధితులు

రిజిస్ట్రేషన్‌ రద్దు చేసుకున్న వారు ఏ లాగిన్‌ నుంచైతే స్లాట్‌ బుక్‌ చేసుకున్నారో? మళ్లీ అదే లాగిన్‌లో క్యా న్సిల్‌ కోసం దరఖాస్తు చేసుకుంటారు. ఆ సందర్భంలో అతని బ్యాంక్‌ అకౌంట్‌ నంబర్‌ కూడా అప్‌లోడ్‌ చేస్తారు. ఆ తర్వాత అది కలెక్టర్‌ లాగిన్‌కు వెళ్తుంది. క్యాన్సిల్‌ దరఖాస్తులను కలెక్టర్‌ ఆమోదిస్తున్నా.. వారి అకౌంట్లలో నగదు జమకావడం లేదు. జిల్లా వ్యాప్తంగా సుమారు 250 మంది ఈ తరహా బాధి తులు ఉన్నట్లు సమాచారం. వీరిలో ఒక్క ఫరూఖ్‌నగర్‌ మండల పరిధిలోనే 12 మంది ఉండటం గమనార్హం. తమ డబ్బులు తిరిగి ఇప్పించాలని కలెక్టరేట్‌ చుట్టూ బాధితులు ప్రదక్షిణలు చేస్తున్నారు.

న్యూస్‌రీల్‌

‘ధరణి’ పోర్టల్‌తో తంటా

అనివార్య కారణాలతో రిజిస్ట్రేషన్లు రద్దయితే ఇక అంతే..

అప్పటికే చెల్లించిన రిజిస్ట్రేషన్‌ ఫీజు వాపస్‌రాని వైనం

కొనుగోలుదారుల డబ్బులు

ఏళ్లుగా ప్రభుత్వ ఖాతాలోనే..

పట్టించుకోని అధికారులు.. ఆందోళనలో బాధితులు

No comments yet. Be the first to comment!
Add a comment
కేంద్ర బృందానికి వివరాలు వెల్లడిస్తున్న అదనపు కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌1
1/1

కేంద్ర బృందానికి వివరాలు వెల్లడిస్తున్న అదనపు కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement