రేపు స్పాట్‌ అడ్మిషన్లు | - | Sakshi
Sakshi News home page

రేపు స్పాట్‌ అడ్మిషన్లు

Published Sun, Aug 27 2023 7:40 AM | Last Updated on Sun, Aug 27 2023 7:40 AM

- - Sakshi

యాచారం: మండల కేంద్రంలో కొనసాగుతున్న తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల (బాలుర)లో 2023–24 విద్యా సంవత్సరానికి గాను ఎంఈసీ, సీఈసీ మొదటి ఏడాదిలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ కోసం ఈనెల 28న (సోమవారం) స్పాట్‌ అడ్మిషన్‌ ఉంటుందని ప్రిన్సిపాల్‌ కె.యాదయ్య శనివారం ఒక ప్రకటనతో పేర్కొన్నారు. పదో తరగతిలో 6.5 కంటే అధికంగా గ్రేడ్ల మార్కులు సాధించిన రెగ్యులర్‌ విద్యార్థులకు మాత్రమే అవకాశం ఉందని తెలిపారు.

ఇంటర్‌ ఎంపీసీలో సీట్ల భర్తీకి

రేపు స్పాట్‌ అడ్మిషన్స్‌

మొయినాబాద్‌రూరల్‌: సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల కళాశాల చేవెళ్లలో విద్యార్థినులకు ఇంటర్మీడియెట్‌ ఎంపీసీ గ్రూప్‌లో ఈ నెల 28న స్పాట్‌ అడ్మిషన్స్‌ నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్‌ రమాదేవి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆసక్తి గల విద్యార్థులు 10వ తరగతి జిరాక్స్‌ మెమోతో ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు హాజరుకావాలని సూచించారు. మెరిట్‌ ఆధారంగా ఎంపిక ఉంటుందన్నారు.

మా బిడ్డ జాడ చెప్పండి

అబ్దుల్లాపూర్‌మెట్‌: కళాశాల హాస్టల్‌ నుంచి తమ కుమారుడు అదృశ్యమై వారం రోజులు గడుస్తున్నా యాజమాన్యం పట్టించుకోవడం లేదని బాధిత తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థి మిస్సింగ్‌కు యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ శనివారం స్టూడెంట్‌ యూనియన్లతో కలిసి ఆందోళన చేపట్టారు. అబ్దుల్లాపూర్‌మెట్‌లోని బ్రిలియంట్‌ విద్యాసంస్థల్లో డిప్లొమా సెకండియర్‌ చదువుతున్న ఆంజనేయులు ఈనెల 20న కళాశాలకు చెందిన హాస్టల్‌ నుంచి బయటకు వెళ్లి తిరిగిరాలేదు. వారం రోజులుగా కుమారుడి జాడ లేకపోవడంపై తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. పోలీసులు, యాజమాన్యం స్పందించి ఆచూకీ కనుక్కోవాలని విజ్ఞప్తి చేశారు.

వాస్‌దేవ్‌పూర్‌

సర్పంచ్‌ మృతి

కడ్తాల్‌: మండల పరిధిలోని వాస్‌దేవ్‌పూర్‌ సర్పంచ్‌ పాత్లావత్‌ చాందీ (78) శనివారం తెల్లవారుజామున మృతిచెందారు. ఆమె కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఏఐసీసీ కార్యదర్శి చల్లా వంశీచంద్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకుడు ఆచారి, పీసీసీ సభ్యుడు అయిళ్ల శ్రీనివాస్‌గౌడ్‌, ఎంపీపీ కమ్లీమోత్యానాయక్‌, జెడ్పీటీసీ దశరథ్‌నాయక్‌, సర్పంచ్‌ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనర్సింహారెడ్డి, కాంగ్రెస్‌ నేతలు బీక్యానాయక్‌, నర్సింహ, బీచ్యానాయక్‌, ఎంపీటీసీ లచ్చిరామ్‌నాయక్‌, సర్పంచ్‌లు శంకర్‌, పాండు, వెంకోబా, రామునాయక్‌, సేవ్యానాయక్‌, సింగిల్‌విండో డైరెక్టర్‌ చేగూరి వెంకటేశ్‌ తదితరులు చాందీ మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

రైనోప్లాస్టీపై అంతర్జాతీయ వర్క్‌షాప్‌

బంజారాహిల్స్‌: ముఖ సౌందర్యం, శ్వాస పీల్చుకోవడంలో సమస్యలు, నాసికా శస్త్ర చికిత్సల వంటి ఆధునిక పరిశోధన ఫలితాలపై చర్చించడంతో పాటు యువ వైద్యులకు రైనోప్లాస్టి శస్త్ర చికిత్సలపై శిక్షణ ఇచ్చేందుకు 8వ అంతర్జాతీయ రైనోప్లాస్టీ వర్క్‌షాప్‌ను శనివారం బంజారాహిల్స్‌లోని కేర్‌ ఆస్పత్రి ఓపీ విభాగంలో ప్రారంభించారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు వర్క్‌షాప్‌ను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఆస్పత్రి ఈఎన్‌టీ, ఫేషియల్‌ ప్లాస్టిక్‌ శస్త్ర చికిత్సల విభాగాధిపతి డాక్టర్‌ ఎన్‌. విష్ణుస్వరూప్‌రెడ్డి మాట్లాడుతూ.. అనుభవజ్ఞులైన వైద్యులు నిర్వహించే శస్త్రచికిత్సలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించి యువ వైద్యులు తమ నైపుణ్యాన్ని మెరుగుదిద్దుకునే అవకాశం ఉందన్నారు. వర్క్‌షాప్‌లో సుమారు 150 మంది ఈఎన్‌టీ డాక్టర్లు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
కళాశాల ఎదుట ఆందోళన చేస్తున్న 
తల్లిదండ్రులు, విద్యార్థి నాయకులు  1
1/2

కళాశాల ఎదుట ఆందోళన చేస్తున్న తల్లిదండ్రులు, విద్యార్థి నాయకులు

చాందీ (ఫైల్‌)2
2/2

చాందీ (ఫైల్‌)

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement