నేడు షాబాద్‌లో మంత్రి పర్యటన | - | Sakshi
Sakshi News home page

నేడు షాబాద్‌లో మంత్రి పర్యటన

Published Tue, Aug 29 2023 2:54 AM | Last Updated on Tue, Aug 29 2023 2:54 AM

- - Sakshi

షాబాద్‌: మండలంలో మంగళవారం మంత్రి మహేందర్‌రెడ్డి పర్యటించనున్నట్లు జెడ్పీటీసీ పట్నం అవినాశ్‌రెడ్డి తెలిపారు. ఉదయం 10గంటలకు కొమరబండ గ్రామ పరిధిలో వాగుపై బ్రిడ్జి నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేస్తారని తెలిపారు.అనంతరం సన్మాన కార్య క్రమం ఉంటుందన్నారు.మంత్రితో పాటు చేవెళ్ల ఎంపీ డాక్టర్‌ గడ్డం రంజిత్‌రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్‌ తీగల అనితారెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య తదితరులు హాజరవుతారని తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ శ్రీనివాస్‌గౌడ్‌, రైతుబంధు మండల అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి, సర్పంచులు ఏశాల చంద్రశేఖర్‌, నర్సింహారెడ్డి, మాజీ సర్పంచ్‌ దేవేవందర్‌రెడ్డి పాల్గొన్నారు.

మంత్రి హరీశ్‌ను కలిసిన శ్రీనివాస్‌రెడ్డి

ఆమనగల్లు: రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావును సోమవారం బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు గోలి శ్రీనివాస్‌రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్‌లో మంత్రిని కలిసి కల్వకుర్తి నియోజకవర్గం అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఇందుకు మంత్రి సానుకూలంగా స్పందించినట్లు శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.

నేడు జోనల్‌స్థాయి

వాలీబాల్‌ పోటీలు

మొయినాబాద్‌ రూరల్‌: మండలంలోని అజీజ్‌నగర్‌ జెడ్పీహెచ్‌ఎస్‌లో మంగళవారం రాజేంద్రనగర్‌ జోనల్‌ స్థాయి వాలీబాల్‌ పోటీలు నిర్వహించనున్నట్లు ఆ జోనల్‌ కార్యదర్శి బాలస్వామిరెడ్డి తెలిపారు. మొయినాబాద్‌, రాజేంద్రనగర్‌, గండిపేట్‌, శంషాబాద్‌ మండలాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదివే 14 నుంచి 17 ఏళ్ల లోపు విద్యార్థులు అర్హులని తెలిపారు. పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు వారి వారి పాఠశాలల నుంచి బోనొఫైడ్‌ సర్టిఫికెట్‌తో పాటు ఆధార్‌ కార్డును తీసుకురావాలని సూచించారు. ఉదయం 10 గంటలకు పోటీలు ప్రారంభమవుతాయని తెలిపారు.

రేపు డబుల్‌ బెడ్‌రూం

ఇళ్లకు లాటరీ

సాక్షి, రంగారెడ్డి జిల్లా: జిల్లాలోని శేర్‌లింగంపల్లి, ఎల్బీనగర్‌, మహేశ్వరం, రాజేంద్రనగర్‌ నియోజకవర్గాల పరిధిలోని రెండు వేల మంది లబ్ధిదారులకు ఈ నెల 30న డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను లాటరీ పద్ధతిన కేటాయించనున్నట్లు కలెక్టర్‌ హరీష్‌ ప్రకటించారు. ఈ మేరకు సోమ వారం ఆయన ప్రకటన విడుదల చేశారు. బుధవారం కలెక్టరేట్‌లో లాటరీ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందుకోసం ప్రత్యే క సాఫ్ట్‌వేర్‌ను రూపొందించినట్లు తెలిపారు. మంత్రి సబితారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరు కానున్నట్లు పేర్కొన్నారు. నాలుగు నియోజకవర్గాల నుంచి మొత్తం 93,899 దరఖాస్తులు అందగా, వీటిలో 12,479 మంది అర్హత సాధించగా, వీరిలో మొదటి విడతగా నియోజకవర్గా నికి 500 చొప్పున మొత్తం 2వేల మంది లబ్ధిదారులకు ఆయా ప్రజాప్రతినిధుల సమక్షంలో ఇళ్లను అందజేయనున్నట్లు ప్రకటించారు.

జాతీయ స్థాయి

జూడో పోటీలకు దీపిక

మొయినాబాద్‌ రూరల్‌: సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలల విద్యార్థులకు నిర్వహించిన రాష్ట్ర స్థాయి 8వ జూనియర్‌ జూడో చాంపియన్‌ షిప్‌ పోటీల్లో చేవెళ్ల గురుకుల విద్యార్థిని బంగారు పతకం సాధించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్‌ రమాదేవి మాట్లాడుతూ.. ఇటీవల కరీంనగర్‌లో జరిగిన పోటీల్లో తమ కళాశాల విద్యార్థిని దీపిక 44 కేజీల విభాగంలో బంగారు పతకం సాధించి జాతీయ పోటీలకు ఎంపికై నట్లు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
మంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలిస్తున్న జెడ్పీటీసీ అవినాశ్‌రెడ్డి 1
1/2

మంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలిస్తున్న జెడ్పీటీసీ అవినాశ్‌రెడ్డి

రాష్ట్రస్థాయి పోటీల్లో 
ట్రోఫీ అందుకుంటున్న దీపిక 2
2/2

రాష్ట్రస్థాయి పోటీల్లో ట్రోఫీ అందుకుంటున్న దీపిక

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement