ఓటరు నమోదు కోసం దరఖాస్తు చేసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

ఓటరు నమోదు కోసం దరఖాస్తు చేసుకోవాలి

Published Tue, Oct 17 2023 4:46 AM | Last Updated on Tue, Oct 17 2023 4:46 AM

- - Sakshi

ఇబ్రహీంపట్నం రూరల్‌: ఓటరు నమోదు కోసం ట్రాన్స్‌జెండర్స్‌ దరఖాస్తు చేసుకోవాలని జిల్లా సంక్షేమాధికారి పద్మజ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈనెల 17న మహిళా శక్తి కేంద్రం, సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయం పక్క న సరూర్‌నగర్‌లో ట్రాన్స్‌జెండర్‌ ఓటరు నమో దు, సర్టిఫికెట్‌, ఐడీ కార్డు జారీ కోసం దర ఖాస్తు చేసుకోవాలన్నారు. ఆధార్‌కార్డు, ఇతర అడ్రస్‌ ప్రూఫ్‌, పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫొటో తీసుకు రావాల్సిందిగా సూచించారు. ట్రాన్స్‌జెండర్స్‌ సర్టిఫికెట్‌ కోసం నోటరీ చేయించుకొని అఫిడవిట్‌ ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ఈ క్యాంపులో వీటిని ఉచితంగా అందజేస్తున్నట్లు తెలిపారు.

కాంగ్రెస్‌ సేవాదళ్‌

కార్యదర్శిగా కానుగుల

ఆమనగల్లు: కాంగ్రెస్‌ సేవాదళ్‌ కార్యదర్శిగా ఆమనగల్లు పట్టణానికి చెందిన కానుగుల దశరథం నియమితులయ్యారు. ఈ మేరకు ఆల్‌ ఇండియా కాంగ్రెస్‌ సేవాదళ్‌ చీఫ్‌ ఆర్గనైజర్‌ లాల్‌జీ దేశాయ్‌ నియామకపు ఉత్తర్వులు జారీ చేశారు. పట్టణంలో జరిగిన కార్యక్రమంలో కానుగుల దశరథం కు ఏఐసీసీ కార్యదర్శి చల్లా వంశీచంద్‌రెడ్డి, కల్వకుర్తి కాంగ్రెస్‌ అభ్యర్థి కసిరెడ్డి నారాయణరెడ్డి నియామకపు ఉత్తర్వులు అందించారు. అనంతరం దశరథంను ఘనంగా సత్కరించారు.

‘వర్గీకరణ’ బిల్లు ప్రవేశపెట్టాలి

తలకొండపల్లి: నవంబర్‌లో జరగనున్న పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టి చట్టబద్ధత కల్పించాలని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు, మహా జన నేత మందకృష్ణ మాదిగ డిమాండ్‌ చేశారు. పార్లమెంట్‌లో ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్‌ చేస్తూ ఈనెల 7న అలంపూర్‌ నుంచి హైదరాబాద్‌ వరకు చేపట్టిన మాదిగ విశ్వరూప మహాపాదయాత్ర సోమ వారం తలకొండపల్లి మండలానికి చేరింది. మండల పరిధిలోని మాదాయిపల్లి, చౌదర్‌పల్లి, మెదక్‌పల్లి, తలకొండపల్లి గ్రామాల మీదు గా సాగింది. స్థానిక నాయకులు మందకృష్ణకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఎస్సీ వర్గీకరణ బిల్లుకు చట్టబద్ధత కల్పించి మాదిగలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చిన కేంద్రం మాట తప్పిందని విమర్శించారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర అధ్యక్షడు గోవింద్‌ నరేష్‌, ఉపాధ్యక్షుడు సతీస్‌, ఎంఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు కార్తీక్‌, ఎమ్మార్పీఎస్‌ జిల్లా అధ్యక్షుడు నర్సింహ, కార్యదర్శి కిరణ్‌పూలే తదితరులు పాల్గొన్నారు.

రూ.29 లక్షలు పట్టివేత

ఇబ్రహీంపట్నం: ద్విచక్ర వాహనాల్లో తరలిస్తున్న రూ.29 లక్షల నగదును ఇబ్రహీంపట్నం పోలీసులు సోమవారం పట్టుకున్నారు. ఎస్‌ఐ మైబెల్లి తెలిపిన వివరాల ప్రకారం.. ఎన్నికల నిబంధనల మేరకు వాహనాలు తనిఖీ చేస్తుండగా స్థానిక మార్కెట్‌ యార్డు రోడ్డులో వేర్వేరు వ్యక్తులు ఆరు ద్విచక్ర వాహనాల్లో తరలిస్తున్న రూ.29 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన డబ్బును ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి అప్పగించినట్లు చెప్పారు.

చేవెళ్లలో పట్టుబడిన రూ.11.40 లక్షలు

చేవెళ్ల: మండలంలోని పోలీస్‌ చెక్‌పోస్టుల్లో సోమవారం రెండుచోట్ల రూ.11.40 లక్షల నగదు పట్టుబడింది. శంకర్‌పల్లి చౌరస్తా వద్ద నిర్వహించిన తనిఖీల్లో ఓ కారులో రూ.2.60 లక్షలు దొరకగా, మండలంలోని అంతారం చెక్‌పోస్ట్‌ వద్ద వికారాబాద్‌ వైపునుంచి వస్తున్న కారులో రూ.8.80లక్షల నగదును తీసుకెళ్తుండగా పోలీసులు పట్టుకున్నారు. వీటికి సంబంధించిన ఆధారాలు లేకపోవటంతో స్వాధీనం చేసుకున్నారు.

రూ.3.40 లక్షలు పట్టివేత

మంచాల: ఎన్నికల నేపథ్యంలో పోలీసులు విస్తృత తనిఖీలు చేపడుతున్నారు. ఎస్‌ఐ రవినాయక్‌ కథనం ప్రకారం.. మండల కేంద్రంలోని చిత్తాపూర్‌ ఎక్స్‌రోడ్డు వద్ద సోమవారం వాహనాల తనిఖీ చేపట్టారు. చిత్తాపూర్‌ నుంచి ఇబ్రహీంపట్నంకు కారులో వెళ్తున్న చర్ల పటేల్‌గూడకు చెందిన మహిపాల్‌ యాదవ్‌ వద్ద రూ.3.40 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో డబ్బులు సీజ్‌ చేసి అధికారులకు అప్పగించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/2

పాదయాత్రలో మంద కృష్ణ మాదిగ,
ఇతర నాయకులు  2
2/2

పాదయాత్రలో మంద కృష్ణ మాదిగ, ఇతర నాయకులు

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement