నేడు మైసిగండి మైసమ్మ ఆలయం మూసివేత | - | Sakshi
Sakshi News home page

నేడు మైసిగండి మైసమ్మ ఆలయం మూసివేత

Published Sat, Oct 28 2023 7:32 AM | Last Updated on Sat, Oct 28 2023 7:32 AM

- - Sakshi

కడ్తాల్‌: మండల పరిధిలోని మైసిగండి మైసమ్మ దేవత ఆలయాన్ని చంద్రగ్రహణం కారణంగా శనివారం ఉదయం 11 గంటలకు మూసివేయనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. గ్రహణం ముగిసిన అనంతరం 29న (ఆదివారం) ఉదయం 8 గంటలకు సంప్రోక్షణ, ప్రత్యేక పూజల అనంతరం ఆలయాన్ని తిరిగి తెరవనున్నట్లు చెప్పారు. అనంతరం అమ్మవారి దర్శనానికి భక్తులను అనుమతించడం జరుగుతుందన్నారు.

దరఖాస్తుల ఆహ్వానం

షాబాద్‌: స్థానిక ఆదర్శ పాఠశాల, కళాశాలలో ఉపాధ్యాయులను భర్తీ చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఎల్‌.శ్రీవాచ్య శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 31 వరకు అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. టీజీటీ హిందీ, పీజీటీ జియోలజీ, కామర్స్‌ బోధించేందుకు అర్హత కలిగిన అభ్యుర్థులు ఆదర్శ పాఠశాలలో దరఖాస్తులు అందజేయాలని సూచించారు. టీజీటీ, హిందీ బోధించడానికి డిగ్రీ, హెచ్‌పీటీ, కామర్స్‌ బోధించడానికి టెట్‌, పీజీటీ కామర్స్‌కు ఎంకం, పీజీటీ జియోలజీ బోధించడానికి ఎమ్మెస్సీ, బీఈడీ అర్హత కలిగి ఉండాలని తెలిపారు.

కోరం లేక జెడ్పీ

సమావేశం వాయిదా

సాక్షి, రంగారెడ్డిజిల్లా: జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశం కోరం లేక వాయిదా పడింది. ఈ మేరకు శుక్రవారం ఉదయం 11 గంటలకు జెడ్పీ చైర్‌పర్సన్‌ డాక్టర్‌ తీగల అనితారెడ్డి, సీఈ ఓ దిలీప్‌ కుమార్‌, ముగ్గురు జెడ్పీటీసీలు, నలుగురు ఎంపీపీలు, వివిధ శాఖల జిల్లా అధికారులు హాజరయ్యారు. కోరం లేక పోవడంతో సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఎన్నికల ప్రచారం నేపథ్యంలో మెజార్టీ సభ్యులు సమావేశానికి హాజరు కాలేదు. నిర్దేశిత సమయం దాటి పోవడంతో సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు అనితారెడ్డి ప్రకటించారు.

యూత్‌ కాంగ్రెస్‌ మీడియా కో కన్వీనర్‌ నియామకం

సాక్షి, రంగారెడ్డిజిల్లా: తెలంగాణ ప్రదేశ్‌ యూత్‌ కాంగ్రెస్‌ మీడియా సెల్‌ రాష్ట్ర జాయింట్‌ మీడియా కో కన్వీనర్‌గా కందుకూరు మండలానికి చెందిన కప్పాటి శివరామకృష్ణారెడ్డిని నియమిస్తున్నట్లు అలిండియా యూత్‌ కాంగ్రెస్‌ మీడియా సెల్‌ ఇన్‌చార్జి వరుణ్‌ పాండే ప్రకటించారు. ఈ మేరకు ప్రదేశ్‌ యూత్‌ కాంగ్రెస్‌ మీడియా సెల్‌ అధ్యక్షుడు సీహెచ్‌ శైలేంద్ర శుక్రవారం గాంధీభవన్‌లో ఆయనకు నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా శివరామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. తనను ప్రదేశ్‌ యూత్‌ కాంగ్రెస్‌ మీడియా సెల్‌ జాయింట్‌ కన్వీనర్‌గా నియమించినందుకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున కార్గే, రాహుల్‌ గాంధీ, సోనియా గాంధీకి కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం అహర్నిశలు కృషి చేస్తానని చెప్పారు.

నేడు చేవెళ్లలో

కాంగ్రెస్‌ కార్నర్‌ మీటింగ్‌

చేవెళ్ల: మండలకేంద్రంలో శనివారం కాంగ్రెస్‌పార్టీ ఎన్నికల ప్రచార కార్నర్‌ సభ నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ అభ్యర్థి పామెన భీంభరత్‌, పార్టీ మండల వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ శ్రీకాంత్‌రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కాంగ్రెస్‌పార్టీ జాతీయ నాయకులు రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ ప్రారంభించిన బస్సు యాత్ర లో భాగంగా శనివారం సాయంత్రం 6 గంటలకు సభ ఉంటుందని తెలిపారు. సభకు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్ర మార్క, ఉత్తమ్‌కుమార్‌రెడి, పార్టీ రాష్ట్ర సీని యర్‌ నాయకులు, జిల్లా నాయకులు పెద్ద సంఖ్యలో హాజరవుతారని చెప్పారు. సభకు నియోజకవర్గంలోని కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/2

మాట్లాడుతున్న జెడ్పీ చైర్‌పర్సన్‌ అనితారెడ్డి 2
2/2

మాట్లాడుతున్న జెడ్పీ చైర్‌పర్సన్‌ అనితారెడ్డి

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement