ఇంటర్‌లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం | - | Sakshi
Sakshi News home page

ఇంటర్‌లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

Published Fri, Dec 29 2023 7:42 AM | Last Updated on Fri, Dec 29 2023 7:42 AM

- - Sakshi

షాద్‌నగర్‌రూరల్‌: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల ప్రతిభా కళాశాల (సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌)లో 2024–25 విద్యాసంవత్సరంలో ఇంటర్మీడియెట్‌లో చేరేందుకు దరఖాస్తు చేసుకోవాలని కమ్మదనం గురుకుల కళాశాల ప్రిన్సిపాల్‌ విద్యుల్లత గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రథమ సంవత్సరంలో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంఈసీ గ్రూపుల్లో చేరేందుకు ఆన్‌లైన్‌ ద్వారా జనవరి 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. విద్యార్థులు రూ.200 పరీక్ష ీఫీజు చెల్లించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రతిభా కళాశాలలో ఐఐటీ, జేఈఈ, నీట్‌, సీఎంఏ, క్లాట్‌ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. మరిన్ని వివరాలకు 1800 425 45678 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.

పెట్రోల్‌ను విడిగా విక్రయించొద్దు

సాక్షి, రంగారెడ్డిజిల్లా: పెట్రోల్‌ను బాటిళ్లలో విక్రయించడం నిబంధనలకు వ్యతిరేకం అని, ప్రమాదానికి హేతువని పౌర సరఫరాల శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డిప్యూటీ తహసీల్దార్‌ మాచన రఘునందన్‌ స్పష్టం చేశారు. గురువారం ఆయన ఇమామ్‌ గూడలోని పెట్రోల్‌ బంక్‌ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పెట్రోల్‌ బంక్‌లల అనుమతులను కాల పరిమితి ముగిసేలోపే పునరుద్ధరణకు చర్యలు తీసుకోవటం మేలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ విడిగా అమ్మడం చేయరాదన్నారు. అనంతరం తూనికలు కొలతల శాఖ, కేంద్ర ప్రభుత్వ అనుమతి పత్రాలను పరిశీలించారు.

లోక్‌ అదాలత్‌లను సద్వినియోగం చేసుకోవాలి

చేవెళ్ల: వాహనదారులు లోక్‌ అదాలత్‌లను ఉపయోగించుకొని పెండింగ్‌లో ఉన్న ట్రాఫిక్‌ పోలీస్‌ కేసులను పరిష్కరించుకోవాలని రిటైర్డు జడ్జి సాంబశివరావు సూచించారు. మండలకేంద్రంలోని కోర్టు ఆవరణలో చేవెళ్ల ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని పెండింగ్‌ కేసులకోసం నిర్వహిస్తున్న ప్రత్యేక లోక్‌ అదాలత్‌ గురువారం నాలుగో రోజు కొనసాగింది. ఇందులో 105 మద్యం తాగి వాహనాలు నడిపించిన కేసులు పరిష్కారమైనట్టు సాంబశివరావు తెలిపారు. ఈ కేసులకు సంబంధించి రూ.1,34,500 జరిమానాలు విధించినట్లు చెప్పారు. కార్యక్రమంలో ట్రాఫిక్‌ సీఐ సైదులు, ఎస్‌ఐ విఠల్‌రెడ్డి, కోర్టు సిబ్బంది, వాహనదారులు పాల్గొన్నారు.

‘సే నో టు డ్రగ్స్‌’ ప్రారంభం

బండ్లగూడ: మాదకద్రవ్యాలపై జంగ్‌ షురూ చేసిన నగర పోలీసు విభాగం అందుకు అవస రమైన అన్ని చర్యలు తీసుకుంటోంది. ఓపక్క డ్రగ్స్‌ తయారీ, సరఫరా, విక్రయం, వినియో గంపై ఉక్కుపాదం మోపుతూనే యువతలో అవగాహన పెంచడానికీ పెద్ద పీట వేస్తున్నారు. దీనికోసం ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసుకుంటున్నారు. ఇందులో భాగంగానే నగర శివార్లలోని షాదాన్‌ కళాశాలలో జరుగుతున్న పల్సేషన్‌–2023 కార్యక్రమానికి గురువారం హాజరైన నగర కొత్వాల్‌ కొత్తకోట శ్రీనివాసరెడ్డి ‘సే నో టు డ్రగ్స్‌’ క్యాంపెయినింగ్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన కళాశాల నుంచి అప్పా జంక్షన్‌ వరకు జరిగిన 2కే రన్‌లో పాల్గొని ప్లకార్డులు ప్రదర్శించారు. ఇందులో వివిధ కళాశాలలకు చెందిన 2 వేల మంది మెడిసిన్‌ విద్యార్థులు, డాక్టర్లు తదితరులు పాల్గొన్నారు. పల్సేషన్‌–2023లో భాగంగా అంతర్‌ కళాశాలల కల్చరల్‌, లిటరరీ, స్పోర్ట్స్‌, ఫుడ్‌ ఫెస్టివల్స్‌ జరుగుతున్నాయి.

నిమ్స్‌లో వెయ్యి మార్క్‌ దాటిన వ్యాస్కులర్‌ సర్జరీలు

లక్డీకాపూల్‌: నిజాం వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్‌) చరిత్రలో మొదటిసారిగా వ్యాస్కులర్‌ సర్జరీ విభాగం శస్త్రచికిత్సల్లో వెయ్యి మార్క్‌ దాటి తన ఉనికిని చాటుకుంది. ఈ ఏడాది జనవరి నుంచి గురువారం వరకు ఫిస్టులా ఆర్టెరియోవెనస్‌ సర్జరీలు జరిగాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని వ్యాస్కులర్‌ సర్జరీ హెచ్‌ఓడీ డాక్టర్‌ సందీప్‌ ఆధ్వర్యంలో సెలబ్రేట్‌ చేసుకున్నారు. డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ నగరి బీరప్ప కేక్‌ కట్‌ చేశారు. ఈ సర్జరీలో పాల్గొన్నటువంటి వైద్యులను, హెల్త్‌ కేర్‌ సిబ్బందిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
లోక్‌ అదాలత్‌లో కేసులు పరిష్కరిస్తున్న రిటైర్డు జడ్జి సాంబశివరావు1
1/1

లోక్‌ అదాలత్‌లో కేసులు పరిష్కరిస్తున్న రిటైర్డు జడ్జి సాంబశివరావు

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement