నేడు కబడ్డీ క్రీడాకారుల ఎంపిక పోటీలు | - | Sakshi
Sakshi News home page

నేడు కబడ్డీ క్రీడాకారుల ఎంపిక పోటీలు

Published Fri, Feb 9 2024 6:18 AM | Last Updated on Fri, Feb 9 2024 6:18 AM

- - Sakshi

హుడాకాంప్లెక్స్‌: సరూర్‌నగర్‌ ఇండోర్‌ స్టేడియం కబడ్డీ గ్రౌండ్‌లో శుక్రవారం జిల్లా కబడ్డీ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో సబ్‌ జూనియర్‌ బాలురు, బాలికల జిల్లా జట్లకు ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.రవికుమార్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జట్టుకు ఎంపికై న క్రీడా కారులు ఈ నెల 16 నుంచి 19 వరకు సూర్యాపేటలో నిర్వహించే 33వ అంతర్‌ జిల్లా కబడ్డీ పోటీల్లో జిల్లా తరపున పాల్గొంటారని తెలిపా రు.జిల్లా సబ్‌ జూనియర్‌ కబడ్డీ ఎంపిక పోటీల కు హాజరయ్యేందుకు 55 కిలోల బరువు,16 సంవత్సరాల లోపు వాళ్లకే అర్హత ఉందన్నారు. ఆధార్‌కార్డును వెంట తీసుకురావాలన్నారు. వివరాలకు 76619 92581, 90000 38272 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.

వెంకట క్రాంతికిరణ్‌కు

రాష్ట్రస్థాయి సేవా పురస్కారం

కడ్తాల్‌: మండల పరిధిలోని రావిచేడ్‌ గ్రామానికి చెందిన పుట్టపాక వెంకట క్రాంతికిరణ్‌కు రాష్ట్రస్థాయి సేవా పురస్కారం లభించింది. పినాకిని మీడియా ఏటా వివిధ రంగాల్లో సేవ లందించిన వారికి పురస్కారాలు అందజేస్తోంది. ఇందులో భాగంగా సేవా రంగంలో అందించిన సేవలకు గాను వెంకట క్రాంతికిరణ్‌ను ఎంపిక చేసింది. ఈ మేరకు గురువారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో నిర్వహించిన కార్యక్రమంలో వివిధ రంగాల ప్రముఖుల సమక్షంలో క్రాంతికిరణ్‌కు అవార్డు అందజేశా రు. క్రాంతి కిరణ్‌కు అవార్డు రావడంపై గ్రామస్తులతోపాటు పలువురు అభినందించారు.

11న గురుకుల ప్రవేశ పరీక్ష

షాద్‌నగర్‌రూరల్‌: తెలంగాణ సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలలో 2024–25 విద్యాసంవత్సరానికి 5వ తరగతిలో చేరేందుకు ఈ నెల 11న ప్రవేశ పరీక్ష నిర్వహించడం జరుగుతుందని కమ్మదనం గురుకుల పాఠశాల ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌ హేమలత గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నంఒంటిగంట వరకు పరీక్ష కొనసాగుతుందని తెలిపారు. టీటీడబ్ల్యూఆర్‌ఎస్‌, టీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్‌, మహాత్మాజ్యోతిబాపూలే గురుకుల పాఠశాల, టీఎంఆర్‌ఈఐఎస్‌ఈ గురుకులాల్లో ప్రవేశం పొందేందుకు పరీక్ష నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. పరీక్షల్లో సాధించిన మెరిట్‌ లిస్టు ప్రకారం విద్యార్థుల ఎంపిక ఉంటుందన్నారు. పరీక్షకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు ఆన్‌లైన్‌లో హాల్‌టికెట్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలన్నారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులను ఉదయం 10 గంటలకు పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారని.. ఉదయం 9.30 గంటల వరకు పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని చెప్పారు. ఆధార్‌కార్డు, బోనఫైడ్‌, హాల్‌టికెట్‌, బ్లూ, బ్లాక్‌ పెన్ను తెచ్చుకోవాలని సూచించారు.

జీహెచ్‌ఎంసీకి రూ. 200 కోట్లు

భూ సేకరణల నిమిత్తం

బడ్జెట్‌ రిలీజ్‌ ఉత్తర్వు జారీ

సాక్షి, సిటీబ్యూరో: భూ సేకరణల కోసం ప్రభుత్వం జీహెచ్‌ఎంసీకి రూ. 200 కోట్ల బడ్జెట్‌ను విడుదల చేసింది. ఈ మేరకు మున్సిపల్‌ పరిపాలన శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ దానకిశోర్‌ ఉత్తర్వు జారీ చేశారు. 2023– 24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈ బడ్జెట్‌ రిలీజ్‌ ఆర్డర్‌ (బీఆర్‌ఓ)ను జారీ చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జీహెచ్‌ఎంసీకి ఈ నిధులు విడుదల చేసింది. గతంలో బీఆర్‌ఎస్‌ హయాంలో ప్రత్యేకంగా భూసేకరణల కోసమంటూ నిధులు విడుదల కాలేదు. జీహెచ్‌ఎంసీలో ఎస్సార్‌డీపీ, తదితర పథకాల కింద చేపట్టిన పనులు పురోగతిలో ఉన్నాయి. అప్పట్లో టౌన్‌ప్లానింగ్‌ టీడీఆర్‌ల ద్వారానే భూసేకరణల పరిహారం ఎక్కువగా చెల్లించారు. కొంతకాలంగా టీడీఆర్‌లకు డిమాండ్‌ తగ్గిపోయింది. కొన్ని ప్రాంతాల్లో భూసేకరణలు పూర్తికాక పనులు ముందుకు సాగడం లేదు. జూపార్క్‌ నుంచి ఆరాంఘర్‌ వరకు జరుగుతున్న ఫ్లై ఓవర్‌తో సహా మరికొన్ని ప్రాంతాల్లో భూసేకరణ సమస్యలున్నాయి. జీహెచ్‌ఎంసీ ఖజానాలో నిధులు లేనందున భూసేకరణలో జాప్యం జరుగుతోంది. ఈ విషయాన్ని వివరిస్తూ జీహెచ్‌ఎంసీ ప్రభుత్వానికి లేఖ రాసింది. ఇటీవల కమిషనర్‌ ప్రభుత్వంతో జరిపిన సంప్రదింపుల్లో ఈ విషయాన్ని దృష్టికి తెచ్చినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం భూసేకరణల కోసం ఈ నిధులు విడుదల చేసింది. ఈ మేరకు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు పరిపాలన అనుమతులు మంజూరు చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/1

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement