రైతుల శ్రేయస్సుకు ప్రాధాన్యం
అబ్దుల్లాపూర్‌మెట్: రైతుల శ్రేయస్సు ప్రాధాన్యతనిస్తూ మార్కెట్‌కు వచ్చే ప్రతీ రైతుకు న్యాయం చేసేందుకు పాలకవర్గంతో కలిసి పనిచేస్తానని గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్‌రెడ్డి అన్నారు. బుధవారం బాటసింగారం పండ్ల మార్కెట్ కార్యాలయంలో మధుసూదన్‌రెడ్డి అధ్యక్షతన మొదటి పాలవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పండ్ల మార్కెట్‌లో పనిచేసే హమాలీలను గుర్తించి లైసెన్స్ జారీ చేయాలని నిర్ణయించామన్నారు. గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ గొడుగు కిందున్న రైతు బజార్‌లతో పాటుగా ఎన్టీఆర్ నగర్ కూరగాయల మార్కెట్‌కు వచ్చే రైతుల సమస్యలు పరిష్కరించేందుకు వారితో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. సమావేశం అనంతరం మార్కెట్ ఆవరణలో మహిళా ఉద్యోగులు ఏర్పాటు చేసిన బతుకమ్మ సంబురాల్లో నూతన పాలకవర్గం పాల్గొంది. ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆహ్వానితుడు, సింగిల్ విండో చైర్మన్ చామ కృష్ణారెడ్డి, వైస్ చైర్మన్ భాస్కర్ చారి, మార్కెట్ డైరెక్టర్లు జైపాల్‌రెడ్డి, అంజయ్య, మేకం లక్ష్మి, మచ్చేందర్‌రెడ్డి, రఘుపతిరెడ్డి, గణేశ్‌నాయక్, నర్సింహ, బండి మధుసూదన్‌రావు, నవరాజ్, గోవర్ధన్‌రెడ్డి, వెంకట్ గుప్తా, ఇబ్రహీం, మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి శ్రీనివాస్ పలువురు అధికారులు పాల్గొన్నారు.
గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment