మంచాల ఠాణా సీఐగా ఎ.మధు బాధ్యతలు
మంచాల: మంచాల ఠాణా సీఐగా ఎ.మధు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పనిచేసని బాబ్యనాయక్ ఉప్పల్‌కు ట్రాఫిక్ సీఐగా బదిలీ అయ్యారు. దీంతో బాలాపూర్ పీఎస్‌లో డీఐగా పనిచేసిన మధును మంచాల సీఐగా బదిలీపై వచ్చారు. ఈ సందర్భంగా ఆయన్ను బీజేపీ శక్తి కేంద్రం మండల ఇన్‌చార్జి పోలమోని భిక్షపతి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.
పేదల సంక్షేమానికి సీఎం కృషి
మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్‌రెడ్డి
మొయినాబాద్‌రూరల్: పేదల అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిరంతరం కృషి చేస్తున్నాడని శాసన మండలి చీఫ్ విప్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి అన్నారు. బుధవారం పట్నం మహేందర్‌రెడ్డి తెలంగాణ శాసనమండలి చీఫ్ విప్‌గా ప్రమాణస్వీకారం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ చేవెళ్ల నియోజకవర్గ ఇన్‌చార్జి భీంభరత్ ఆధ్వర్యంలో మాజీ ఎంపీ గడ్డం రంజిత్‌రెడ్డి, దేవరంపల్లి మహేందర్‌రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు మాణయ్య, నాయకులు భిక్షపతి, కేబుల్‌రాజు తదితరులు ఆయన్ను ఘనంగా సన్మానించారు. బాధ్యతల స్వీకరణ అనంతరం మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. రా ష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పేదల అభివృద్ధికి సంక్షేమ పథకాలు చేపడుతున్నాడన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌లు, ఎంపీటీసీ మాజీ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment