సంధ్యా సమయం.. సాగర తీరం
చలికాలంలో ఉదయం 5 గంటల వేళ పొగమంచు కురవడం సాధారణమే. కానీ.. సాయంత్రం 5 గంటలప్పుడు పొగమంచుతో హుస్సేన్ సాగర్ పరిసరాలన్నీ మసకమసక చీకట్లను తలపించడంతో సందర్శకులు ఒకింత ఆశ్చర్యచకితులయ్యారు. ఆదివారం 4 గంటల వరకు ఎండకొట్టింది. సూరీడు తన ప్రతాపం చూపించడంతో నగరవాసులు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరయ్యారు. ఆ తర్వాత వాతావరణంలో మార్పు వచ్చింది. మెల్లమెల్లగా పొగమంచు రావడం మొదలైంది. 5 గంటల సమయంలో నగరంలోని పలు ప్రాంతాలు మసకమసకగా మారాయి. హుస్సేన్ సాగర్‌ను పొగమంచు కప్పివేయడంతో తథాగతుడి విగ్రహం, తీరంలోని సచివాలయ భవనం, అంబేడ్కర్ స్టాచ్యూ.. ఇలా కనిపించాయి.
Comments
Please login to add a commentAdd a comment