కారును ఢీకొట్టి.. బైక్‌పైకి దూసుకెళ్లి
● మద్యం లోడ్‌తో వెళ్తున్న బొలెరో బోల్తా
● ఇద్దరు వ్యక్తుల దుర్మరణం
అనంతగిరి: వికారాబాద్ పట్టణం రాజీవ్‌నగర్ కాలనీ సమీపంలో సోమవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వికారాబాద్ నుంచి మద్యం లోడ్‌తో కోట్‌పల్లికి వెళ్తున్న బొలెరో గూడ్స్ వాహనం ఎడమవైపు నుంచి రోడ్డుపైకి వస్తున్న కారును ఢీకొని ఎదురుగా వస్తున్న బైక్‌పైకి దూసుకెళ్లి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజీవ్‌నగర్‌కు చెందిన రవీందర్(45) స్థానిక ప్రభుత్వ మెడికల్ ఆస్పత్రిలో ప్రైవేటు వాచ్‌మన్‌గా పని చేస్తున్నాడు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన హేమంత్(25) అనంతగిరిగుట్టపై నిర్మిస్తున్న ప్రభుత్వ ఆస్పత్రిలో ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నాడు. ఇద్దరూ ఒకే చోట పని చేస్తున్న వీరు రాత్రి బైక్‌పై రాజీవ్‌నగర్ వైపు నుంచి వికారాబాద్ వైపు వెళ్తున్నారు. ఈ క్రమంలో మద్యం లోడ్‌తో వెళ్తున్న బొలెరో గూడ్స్ వెహికల్ కారును ఢీకొని. వీరి బైక్‌పై పడింది. దీంతో టూ వీలర్‌పై ఉన్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108లో వికారాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా కొద్ది సేపటికే మృతిచెందారు. రవీందర్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉండగా.. హేమంత్‌కు రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరి మృతితో కాలనీలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వికారాబాద్ పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment