కారు, బైక్‌ ఢీ | - | Sakshi
Sakshi News home page

కారు, బైక్‌ ఢీ

Published Tue, Dec 3 2024 7:38 AM | Last Updated on Tue, Dec 3 2024 7:38 AM

కారు, బైక్‌ ఢీ

కారు, బైక్‌ ఢీ

ద్విచక్ర వాహనదారుడికి గాయాలు

పరిగి: కారు, బైక్‌ ఢీకొన్న ఘటనలో ద్విచక్రవవాహనదారుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన బీజాపూర్‌ జాతీయ రహదారిపై నజీరాబాద్‌తండా సమీపంలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన ప్రకారం.. పట్టణానికి చెందిన వాజిద్‌ రంగాపూర్‌ నుంచి పరిగి వైపు ప్రయాణిస్తున్నాడు. ఈ క్రమంలో పరిగి నుంచి రంగాపూర్‌ వైపు వెళ్తున్న కారును న్యామత్‌నగర్‌ వైపు టర్న్‌ తీసుకుంటుండగా బైక్‌ వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వాజిద్‌కు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే చికిత్స నిమిత్తం పరిగి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ నుంచి మైరుగైన వైద్యం కోసం నగరానికి తరలించినట్లు సమాచారం.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement