నేడు బోసిపోయి
నిన్నటి వరకు రద్దీ..
చేవెళ్ల: మండలంలోని ఆలూరు బస్‌స్టేజీ వద్ద కూరగాయలు విక్రయించే వారిపైకి దూసుకొచ్చిన లారీ ప్రమాద స్థలం మంగళవారం నిర్మానుష్యంగా మారింది. కూరగాయలు విక్రయించేందుకు ఎవరూ రాలేదు. ప్రమాదం జరిగినప్పుడు భయంతో అక్కడే కూరగాయలు వదిలివెళ్లిన వారు కూడా వాటిని తీసుకెళ్లేందుకు అక్కడికి రాలేదు. దాదాపు 20 నుంచి 30 మంది ఆలూరు, నాంచేరి గ్రామానికి చెందిన రైతులు ఇక్కడ కూరగాయలు విక్రయించేవారు. ఈ సంఘటన వారిని భయభ్రాంతులకు గురి చేసింది. ఈ రోడ్డుపై నిత్యం కార్లలో కూరగాయలకోసం వచ్చే వారు అక్కడ ఎవరూ లేకపోవడంతో ఏం జరిగిందని అక్కడున్న స్థానికులు, పోలీసులను అడిగి తెలుసుకోవడం కనిపించింది. చేవెళ్ల ఏసీపీ కిషన్ ఆధ్వర్యంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు బస్‌స్టేజీ వద్ద భారీ బందోబస్తు నిర్వహించారు.
కూరగాయలు అమ్మొద్దంటూ ఫ్లెక్సీ
సంఘటనా స్థలంలో చేవెళ్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ కూరగాయలు విక్రయించొద్దంటూ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ప్రమాదకరంగా ఉన్న ఈ స్థలంలో ఎవరూ కూరగాయలు అమ్మొద్దని, అమ్మితే రూ.10 వేల జరిమానా విధిస్తామని తెలిపారు. చేవెళ్ల రైతు బజారులో కానీ, మార్కెట్లో కానీ ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తామన్నారు.
నిర్మానుష్యంగా మారిన ఆలూరు బస్‌స్టేజీ
కూరగాయలు విక్రయించేందుకు ముందుకు రాని రైతులు
దారివెంట భారీగా పోలీస్ బందోబస్తు
Comments
Please login to add a commentAdd a comment