● రూలంటే .. రూలే
సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఇలంబర్తి.. తనను కలిసేందుకు వచ్చేవారికి నిబంధనలు అమలు చేస్తున్నారు. ఇప్పటికే తన పేషీలో పోలీసులు.. జీహెచ్‌ఎంసీ రెండు ప్రధాన ద్వారాల వద్ద సందర్శకుల రాకపోకలు తెలిసేలా టీవీలు ఏర్పా టు చేసిన కమిషనర్.. సాధారణ సందర్శకులకు సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల మధ్య వచ్చేవారికి అవకాశం కల్పిస్తున్నారు. ప్రజా ప్రతిని ధులకు సైతం ప్రత్యేక సమయం కేటాయించారు. ప్రజాప్రతినిధులు కలిసేందుకు సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకని పేర్కొంటూ కమిషనర్ పేషీలో అంటించారు. సాధారణ ప్రజలు నేరుగా రాకుండా తొలుత పేషీలోకి వెళ్లే ముందే కౌంటర్‌లో ఉండే కంప్యూటర్ ఆపరేటర్ వద్ద తమ పేరు, వివరాలు, ఎందుకొచ్చిందీ వంటి వివరాలు వెబ్‌పోర్టల్‌లో నమోదు చేయించుకోవాలి. నమోదు కాగానే వారి ఫోన్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. దాన్ని చూపించి కమిషనర్‌ను కలిసేలా ఏర్పాట్లు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment