అభివృద్ధికి బాటలు
దాహార్తి తీరేలా.. నగర దాహార్తి తీరుస్తున్న గండిపేట నుంచి మరో పైపులైన్‌్ ఏర్పాటు చేసి నీటిని తరలించేందుకు కసరత్తు జరుగుతోంది.
8లోu
చేవెళ్ల: ‘పారిశుద్ధ్యం.. రోడ్లు.. డ్రైనేజీ వ్యవస్థపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తాం.. మున్సిపల్ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలతో ముందుకు సాగుతాం.. వందశాతం పన్నుల వసూళ్లపై ప్రణాళిక సిద్ధం చేసుకుంటాం.. కొత్త మున్సిపాలిటీని అన్ని విధాలా అభివృద్ధి చేసి, ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తాం.. పట్టణ ముఖచిత్రాన్ని మార్చేలా అభివృద్ధికి బాటలు వేస్తాను’ అంటున్నారు చేవెళ్ల మున్సిపల్ కమిషనర్ ఎం.పూర్ణచందర్. ‘సాక్షి’తో మున్సిపల్ అభివృద్ధి కార్యక్రమాలపై మాట్లాడారు.. ఆయన మాటల్లోనే..
అనుభవంతో అభివృద్ధికి చొరవ
2011 నుంచి భువనగిరి, వనపర్తి, నాగర్‌కర్నూల్, దేవరకొండ, మిర్యాలగూడ మున్సిపాలిటీల్లో కమిషనర్‌గా పనిచేశాను. అక్కడి మున్సిపాలిటీల అభివృద్ధికి ప్రత్యేక చొరవ తీసుకున్నాను. సర్వీస్ మరో ఏడాదిన్నర మాత్రమే ఉంది. ఆయా మున్సిపాలిటీల్లో పనిచేసిన అనుభవంతో కొత్తగా ఏర్పడిన చేవెళ్ల మున్సిపాలిటీ అభివృద్ధికి శాయశక్తులా ప్రయత్నం చేస్తాను. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సిబ్బంది, ప్రజాప్రతినిధుల సహకారంతో ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తాను.
రాబోయే వేసవిపై స్పెషల్ ఫోకస్
రాబోయే వేసవిని దృష్టిలో పెట్టుకొని మున్సిపల్ పరిధిలో ఎలాంటి నీటి సమస్య రాకుండా చర్యలు తీసుకుంటాను. మున్సిపాలిటీపై అవగాహన కోసం అన్ని విలీన గ్రామాల్లో పర్యటిస్తున్నాను. సమస్యలు, వనరులు, అభివృద్ధి తదితర అన్ని విషయాలను క్షుణ్నంగా పరిశీలిస్తున్నాను. మిషన్‌భగీరథ నీటిని ప్రతి ఇంటికీ అందేలా చూస్తాం. మున్సిపల్ పరిధిలో డంపింగ్ యార్డు కోసం ప్రత్యేక స్థలాన్ని ఏర్పాటు చేసి అభివృద్ధి చేయాల్సి ఉంది. మున్సిపల్ కార్యాలయానికి ప్రత్యేక స్థలం కావాలి, దీనిపై అధికారులతో చర్చిస్తాను.
పన్నుల వసూలు..
సౌకర్యాల కల్పన
మున్సిపల్ పరిధిలోకి వచ్చిన 8 పంచాయతీల్లో ఉపాధి హామీ పథకం పనులు ఉండవు. ఇతర అన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాలు యథావిధిగా అందుతాయి. మున్సిపల్ టౌన్ పరిధిలో వచ్చే కంపెనీల్లో స్థానికులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. మున్సిపాలిటీ ఏర్పాటుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ప్రత్యేక నిధులు వస్తాయి. వాటితో టౌన్ అభివృద్ధి జరుగుతుంది. ప్రజలు సకాలంలో పన్నులు చెల్లించి అభివృద్ధికి సహకరించాలి. పన్నుల పెరుగుదల ఉంటుంది.. అదేస్థాయిలో సౌకర్యాల కల్పన కూడా జరుగుతుంది. ఒకేసారి పన్నులు అమాంతం పెరిగిపోతాయనేది అపోహ మాత్రమే. ప్రస్తుతం పంచాయతీ పరిధిలో ఉన్న ప్రకారమే పన్నుల వసూళ్లు ఉంటాయి.
సమగ్ర అభివృద్ధే అంతిమ ధ్యేయం
మున్సిపాలిటీ అంటేనే ప్రత్యేక విభాగాలు ఉంటాయి. ఇందులో రెవెన్యూ, ఇంజనీరింగ్, శానిటేషన్, అకౌంట్స్, టౌన్‌ప్లానింగ్, మెప్మా, సిబ్బంది ఎస్టాబ్లిష్‌మెంట్ తదితర విభాగాలు వస్తాయి. ఆయా విభాగాల అధికారులు లక్ష్యాల మేరకు బాధ్యతగా పనిచేస్తారు. మొత్తంగా మున్సిపల్ సమగ్ర అభివృద్ధే ధ్యేయం. కొత్త మున్సిపాలిటీలో విలీనమైన 8 గ్రామాలకు సంబంధించి ఆరుగురు కార్యదర్శులు మున్సిపల్ పరిధిలోకి మారారు. ఆయా గ్రామాల్లో ఉన్న పారిశుద్ధ్య సిబ్బంది కూడా ఇక నుంచి మున్సిపల్ పరిధిలోనే ఉంటారు. పన్నుల వసూళ్లకోసం పది కలెక్షన్ మిషన్లు కొనుగోలు చేసి పది బృందాలను ఏర్పాటు చేస్తాం. ప్రత్యేకంగా వందశాతం వసూళ్లకు కృషి చేస్తాను.
Comments
Please login to add a commentAdd a comment