నేడు ఆమనగల్లు మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారం
ఆమనగల్లు: వ్యవసాయ మార్కెట్‌కమిటీ పాలకవర్గం బుధవారం ప్రమాణస్వీకారం చేయనుంది. ఈ మేరకు మార్కెటింగ్‌శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆమనగల్లు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్‌గా యాటగీత, వైస్ చైర్మన్‌గా గూడురి భాస్కర్‌రెడ్డి, పలువురిని డైరెక్టర్‌లుగా నియమిస్తూ గత నెల 22న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో నూతన పాలకవర్గ ప్రమాణస్వీకారోత్సవం అనంతరం శ్రీలక్ష్మి గార్డెన్స్‌లో అభినందన సభ నిర్వహిస్తున్నారు. కార్యక్రమానికి మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడు చల్లా వంశీచంద్‌రెడ్డి హాజరుకానున్నారు. ఏర్పాట్లను మంగళవారం మార్కెట్ చైర్‌పర్సన్ యాట గీత, వైస్ చైర్మన్ భాస్కర్‌రెడ్డి తదితరులు పరిశీలించారు.
ఆమనగల్లు ఠాణాలో
అదనపు డీసీపీ తనిఖీ
ఆమనగల్లు: పట్టణంలోని పోలీసు స్టేషన్‌ను మంగళవారం శంషాబాద్ అదనపు డీసీపీ రాంకుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్‌స్టేషన్ ఆవరణ, పరిసరాలను అనంతరం స్టేషన్ రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా పోలీసుస్టేషన్‌లో నమోదైన కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పోలీసులు ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉండాలని అన్నారు. పోలీసుస్టేషన్‌కు సమస్యలతో వచ్చే వారితో మర్యాదగా వ్యవహరించి ఫిర్యాదులు స్వీకరించాలన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు నిక్కచ్చిగా వ్యవహరించాలని సూచించారు. కార్యక్రమంలో ఆమనగల్లు సీఐ ప్రమోద్‌కుమార్, ఎస్‌ఐ వెంకటేశ్, సిబ్బంది పాల్గొన్నారు.
పండ్ల తోటల పెంపకంపై రైతులకు అవగాహన
మంచాల: పండ్ల తోటల పెంపకంపై రైతులు అవగాహన కలిగి ఉండాలని ఉద్యాన శాఖ జిల్లా అధికారి సురేష్ అన్నారు. మండల కేంద్రంలోని రైతు వేదిక భవనంలో మంగళవారం నిర్వహించిన సదస్సుకు ఆయన ముఖ్య అథితిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రైతులు కాలనుగుణంగా పంటల సాగుపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. ఉద్యాన శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు ఇచ్చే సలహాలు, సూచనలు తప్పక పాటించాలన్నారు. కార్యక్రమంలో ఉద్యాన శాస్త్రవేత్త శ్రీకృష్ణ, అధికారులు ముత్యాలు, రామరావు, మండల వ్యవసాయాధికారి కృష్ణ మోహన్, ఉద్యాన శాఖ అధికారి నవీన తదితరులు పాల్గొన్నారు.
బుగ్గరామలింగేశ్వర స్వామి ఆదాయం రూ.12.8 లక్షలు
మంచాల: మండలంలోని ఆరుట్ల బుగ్గరామలింగేశ్వర స్వామి ఆలయానికి పదిహేను రోజులుగా భక్తులు నుంచి వచ్చిన ఆదాయాన్ని మంగళవారం లెక్కించారు. ఈ సందర్భంగా దేవాదాయశాఖ ఈఓ శ్రీనివాస్‌రెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ అనంగల్ల యాదయ్య మాట్లాడుతూ.. జాతర సందర్భంగా ఆలయానికి రూ.12,8,851 ఆదాయం చేకూరినట్టు చెప్పారు. వాటిలో హుండీ రూపంలో రూ.15,269, చందా రూపంలో రూ.8,25,802 వచ్చాయన్నారు. ప్రసాదానికి సంబంధించి రూ.1.50 లక్షలు, పార్కింగ్‌కు సంబంధించి రూ.2.1లక్షలు వచ్చినట్టు తెలిపారు. వీటిని దేవాలయం పేరు మీద బ్యాంకు ఖాతాలో జమ చేసి ఆలయ అభివృద్ధికి ఉపయోగించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment