రాయపోల్‌లో విషాదం
ఇబ్రహీంపట్నం: మహిళా కానిస్టేబుల్ హత్యతో రాయపోల్‌లో విషాదం నెలకొంది. ఇదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తిని కులాంతర వివాహం చేసుకుందనే కారణంతో.. ఓ యువకుడు సొంత అక్కను నరికి చంపాడనే వార్త దావాణలంలా వ్యాపించింది. గ్రామంలో ఎక్కడ చూసినా ఇదే చర్చ సాగింది. మహిళా కానిస్టేబుల్ హత్య దారుణమని సీపీఎం జిల్లా నాయకులు సామేల్, బుగ్గ రాములు, మల్లేశ్, బీఎస్పీ నాయకురాలు శాంత ఆవేదన వ్యక్తం చేశారు. నాగమణిని హత్య చేసిన ఆమె సోదరుడు పరమేశ్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ మృతురాలి బంధువులు, సీపీఎం నేతలు పోలీస్‌స్టేషన్ ఎదుట ఆందోళన చేశారు.
Comments
Please login to add a commentAdd a comment