గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
రాయదుర్గం: యువతలో దాగి ఉన్న అపార మైన శక్తి వినియోగంలోకి వచ్చినప్పుడే భారత ఆర్థిక వ్యవస్థ రూపురేఖలు మారుతాయని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పేర్కొన్నారు. గచ్చిబౌలి లోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాలో స్కూల్ ఆఫ్ పోసు్ట్రగాడ్యుయేట్ స్టడీస్‌లో శుక్రవారం మూడో స్నాతకోత్సవాన్ని జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సంద ర్భంగా విద్యార్థులకు డిగ్రీ సర్టిఫికెట్లను అందించారు. అనంతరం గవర్నర్ మాట్లాడుతూ.. మనదేశం అద్భుతమైన ఫలితాలను సాధించాలంటే యువత కీలకపాత్ర పోషించాలని అన్నారు. కొత్త కొత్త నైపుణ్యలను అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ అధ్యక్షుడు వి.బి సింగ్ మాట్లాడుతూ ఇంజినీరింగ్ విద్యలోని ప్రధానమైన సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఏరోస్పేస్, మెటలర్జీ, మైనింగ్, మైరెన్ తదితరవాటిలో ఇంకా ఎంతో సాధించాలనే ఆశయంతో 1920లో ఈ సంస్థను ఏర్పాటు చేశామ న్నారు. అనంతరం విద్యార్థులకు మెడల్స్, ప్రశంసాపత్రాలను గవర్నర్ చేతుల మీదుగా అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment