‘పుర’ సమాప్తం
ఇబ్రహీంపట్నం: ఐదేళ్ల పాటు అధికారంతో కళకళలాడిన మున్సిపాలిటీలు సోమవారంతో వెలవెలబోతున్నాయి. మున్సిపల్ పాలకవర్గ పదవీకాలం ముగుస్తుంది. 2020 జనవరి 22న మున్సిపల్ ఎన్నికలు జరగగా ఓట్ల లెక్కింపు 25న చేపట్టారు. 27న చైర్మన్లు, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు పదవీ బాధ్యతలు తీసుకున్నారు. ఆదివారానికి పాలకవర్గ సభ్యులు బాధ్యతలు చేపట్టి ఐదేళ్లు పూర్తి కావడం గమనార్హం. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలోని పాలకవర్గం ప్రారంభం నుంచి పలువురు కౌన్సిలర్లు, చైర్ పర్సన్ కప్పరి స్రవంతిచందుపై అవిశ్వాసం పెట్టినా పట్టువదలని విక్రమార్కుడిలా పోరాడి పదవిని కాపాడుకుంది. ఆ కొద్ది రోజులకే వైస్ చైర్మన్ ఆకుల యాదగిరిపై కౌన్సిలర్లు అవిశ్వాసం పెట్టగా ఆయన పదవిని నిలుపుకోలేక పోయారు. అనంతరం జరిగిన వైస్ చైర్మన్ ఎన్నికలో బర్ల మంగయాదవ్ విజయం సాధించారు. దీంతో ఐదేళ్ల కాలంలో ఒక చైర్మన్, ఇద్దరూ వైస్ చైర్మన్లు ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీకి పని చేశారు. మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఎన్నో ఒడిదొడుకులను పాలకవర్గం ఎదుర్కొంది. అయితే అభివృద్ధి విషయంలో కొంత వెనుకబాటు కనిపించిందని స్థానికుల అభిప్రాయం. కాగా మున్సిపల్ ఎన్నికలను కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టకపోవడంతో మున్సిపాలిటీలు ప్రత్యేకాధికారుల పాలనలోకి వెళ్లనున్నాయి. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీకి ప్రత్యేకాధికారిగా అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ నియమితులయ్యారు.
మళ్లీ వచ్చేవారెవరో
వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కొంతమంది కౌన్సిలర్లు పోటీకి విముఖత చూపుతుండగా మరికొంత మంది సుముఖత వ్యక్తం చేస్తున్నారు. రిజర్వేషన్లు, ఆయా పార్టీల టికెట్ల కేటాయింపులను బట్టి భవిష్యత్తులో ఎంతమంది తిరిగి కౌన్సిల్‌లోకి అడుగుపెడుతారో వేచి చూడాలి. పదవీకాలం ముగియడంతో ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డిని చైర్‌పర్సన్ స్రవంతి, వైస్ చైర్‌పర్సన్ మంగ, కౌన్సిలర్లు మర్యాదపూర్వకంగా కలిశారు.
ముగిసిన మున్సిపాలిటీ పాలకవర్గం పదవీకాలం
పెద్దఅంబర్‌పేట ప్రత్యేకాధికారిగా ప్రతిమాసింగ్
అబ్దుల్లాపూర్‌మెట్: పెద్దఅంబర్‌పేట పురపాలక సంఘం ప్రత్యేకాధికారిగా జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పురపాలక సంఘాల పాలకవర్గాల పదవీకాలం ఆదివారంతో ముగియడంతో ఎన్నికల జరిగేంత వరకూ ప్రత్యేకాధికారుల పాలనే కొనసాగనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment