ఆరు గ్యారంటీల పేరుతో మోసం
యాచారం: అనేక హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం చేసిందని బీజేపీ దళిత మోర్చా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కొప్పు బాషా ఆరోపించారు. మండల పరిధిలోని చింతుల్ల గ్రామానికి చెందిన దొడ్డి అంజయ్య, దొడ్డి బాబయ్యలతో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు ఆదివారం బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఆరు గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ సర్కార్ ఏడాదిగా సర్వేలు చేస్తూనే ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా గ్రామాల్లో అర్హులైన పేదవారికి సంక్షేమ పథకాలు అందించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు తాండ్ర రవీందర్, నాయకులు యాదయ్య, శ్రీధర్‌గౌడ్, కృష్ణ, కుమార్, ప్రకాష్, రాంరెడ్డి, పాండుచారి తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బాషా
Comments
Please login to add a commentAdd a comment