వర్గీకరణతో మాదిగలకు న్యాయం
చేవెళ్ల: మాదిగల సమస్యలను పరిష్కరించటంతోపాటు జాతి ఐక్యత కోసమే ఎమ్మార్పీఎస్ పని చేస్తోందని సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు, చేవెళ్ల నియోజకవర్గ ఇన్‌చార్జి క్యాసారం శంకర్‌రావుమాదిగ అన్నారు. మండల కేంద్రంలో ఆదివారం ఎమ్మార్పీఎస్ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణ ఏర్పాటుతో మాదిగలకు న్యాయం జరుగుతుందన్నారు. ఎమ్మార్పీఎస్ చేవెళ్ల గ్రామ నూతన కమిటీని నియమించారు. అధ్యక్షుడిగా యాదయ్య, ఉపాధ్యక్షుడిగా దయాకర్, కార్యదర్శులుగా రాజు, వెంకటేశ్, కోశాధికారిగా బాలక్రిష్ణ, అధికార ప్రతినిధిగా శ్రీనివాసులు, సలహాదారులుగా బుచ్చయ్య, జగన్నాథం, వెంకటయ్య, శ్రీనివాస్, మానిక్యం, మహేందర్‌లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మాదిగ నాయకులు నూతనంగా ఎన్నికై న కమిటీ సభ్యులను శాలువాలతో సన్మానించారు.
ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శంకర్‌రావుమాదిగ
Comments
Please login to add a commentAdd a comment