కొనుగోలు కేంద్రాల్లో పకడ్బందీ ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

కొనుగోలు కేంద్రాల్లో పకడ్బందీ ఏర్పాట్లు

Published Thu, Sep 26 2024 11:42 AM | Last Updated on Thu, Sep 26 2024 11:42 AM

కొనుగోలు కేంద్రాల్లో పకడ్బందీ ఏర్పాట్లు

కలెక్టర్‌ క్రాంతి

సంగారెడ్డి జోన్‌: వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు కలగకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ వీ క్రాంతి అధికారులకు ఆదేశించారు. బుధవారం సంగారెడ్డి కలెక్టరేట్‌ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో కలిసి ఆమె.. ధాన్యం కొనుగోలు కేంద్రాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, జిల్లావ్యాప్తంగా వరి పంట 1,49,370 ఎకరాలలో సాగైందన్నారు. 37,342.50 టన్నుల దిగుబడి వచ్చే అవకాశం ఉందన్నారు. క్రాప్‌ బుకింగ్‌ వివరాలు వ్యవసాయ శాఖ అధికారులు అందించాలని సూచించారు. ప్రస్తుత ఖరీఫ్‌లో క్వింటాలుకు రూ.2,320, కామన్‌ వైరెటీ రూ.2,300, సన్నధాన్యానికి అదనంగా రూ.500లు చెల్లించడం జరుగుతుందన్నారు. జిల్లాలో మరో రెండు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ ఆదేశించారు. సమావేశంలో జిల్లా అడిషనల్‌ కలెక్టర్‌ మాధురి పాల్గొన్నారు.

ప్రజలకు మెరుగైన సేవలు

మునిపల్లి(అందోల్‌): ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందజేయాలని కలెక్టర్‌ వీ క్రాంతి వైద్యసిబ్బందికి సూచించారు. బుధవారం మండల కేంద్రమైన మునిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. అనంతరం నెలకు ఎన్ని ప్రసవాలు జరుగుతున్నాయి, రోజుకు ఎంతమంది రోగులు వైద్యసేవలు పొందుతున్నారనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం తహసీల్దార్‌ కార్యాలయాన్ని, బుదేరా మహిళ డిగ్రీ కళాశాలను సందర్శించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. 29 సర్వే నంబర్‌లో 18 ఎకరాల భూమి మహిళా డిగ్రీ కళాశాలకు, 5 ఎకరాలు ఇంటర్‌ కాలేజీకి ప్రభుత్వం కేటాయించిందని తహసీల్దార్‌ తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్‌ ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement