రాముడొచ్చాడు..
బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావుకు శుక్రవారం కందిలో ఘన స్వాగతం పలికారు. కందిలోని జిల్లా జైలులో ఉన్న వికారాబాద్ జిల్లా లగచర్ల రైతులను పరామర్శించేందుకు వచ్చారు. కేటీఆర్ వస్తున్నారనే సమాచారంతో నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున తరలివచ్చారు. జాతీయ రహదారిపై గల ఓ దాబా వద్ద కేటీఆర్ కోసం పెద్ద ఎత్తున నిరీక్షించారు. ఇంతలోనే ఆయన రాగానే జై కేటీఆర్ అంటూ నినాదాలు చేయగా, వారికి అభివాదం చేశారు. కాగా, బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులను కట్టడి చేయడం పోలీసులకు ఇబ్బందిగా మారింది. అప్పటికే బారికేడ్ల ఏర్పాటు చేయడంతో కాన్వాయ్‌తో కేటీఆర్ జైలు లోపలకు వెళ్లారు. కేటీఆర్ వెంట వచ్చిన నాయకులు, కార్యకర్తలు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. – కంది(సంగారెడ్డి)
Comments
Please login to add a commentAdd a comment