మొక్కవోని దీక్షకు దక్కిన ఫలితం
నారాయణఖేడ్: ఖేడ్ జంట గ్రామమైన మంగళ్పేటకు చెందిన రాజ్ కుమార్. నాలుగు, ఐదు సంవత్సరాలుగా ఎలాగైనా ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించాలని పట్టుదలతో పరీక్షలకు సిద్ధమవుతున్నాడు. గ్రూప్4 రాస్తే ఇటీవల విడుదలైన ఫలితాల్లో ప్రభుత్వం కొలువు సాధించాడు. వాణిజ్య పనుల విభాగంలో జూనియర్ అసిస్టెంట్ గా పోస్టింగ్ ఇచ్చారు. మొట్టమొదటి ప్రభుత్వ ఉద్యోగం దక్కించుకోవడం తనకు ఆనందంగా ఉందని రాజ్ కుమార్ ఈ సందర్భంగా తెలిపారు. కర్ణాటక సెంట్రల్ వర్సిటీలో ఇంటిగ్రేటెడ్ బీఎస్సీ పూర్తి చేశారు. నారాయణఖేడ్ మండలం పిప్పిరికి చెందిన ధనరాజ్ డిగ్రీలో బీఎస్సీ కోర్సు పూర్తి చేశాడు. ప్రభుత్వ ఉద్యోగం సాధించడం కోసం ఐదు సంవత్సరాలుగా ప్రిపరేషన్ చేస్తున్నాడు. గ్రూప్ 4 పరీక్షలు రాసి విడుదలైన ఫలితాల్లో ఉద్యోగం దక్కించుకున్నాడు. ధనరాజుకు మున్సిపల్ వార్డు అధికారిగా ఉద్యోగం ఇచ్చారు. తాను కష్టపడి చదివినందుకు ఫలితం దక్కిందని ఆనందం వ్యక్తం చేస్తున్నాడు.
గ్రూప్4లో ఇద్దరికి ప్రభుత్వ కొలువులు
Comments
Please login to add a commentAdd a comment