శారీరక శ్రమతో డయాబెటీస్‌కు చెక్
● ట్రైనీ కలెక్టర్ మనోజ్ ● జోగిపేటలో డయాబెటీస్ అవగాహన కరపత్రాల ఆవిష్కరణ
జోగిపేట(అందోలు): శారీరక శ్రమతో డయాబెటీస్ దరిదాపుల్లోకి కూడా రాదని, యువత డయాబెటిస్ వ్యాధి బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా ట్రైనీ కలెక్టర్ మనోజ్ సూచించారు. జోగిపేటలోని ఎంపీపీ కార్యాలయం వద్ద లయన్స్‌క్లబ్ ఆధ్వర్యంలో చేపడుతున్న డయాబెటీస్ వీక్ కార్యక్రమంలో భాగంగా కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి లయన్స్‌క్లబ్ ప్రోగ్రాం చైర్మన్ ఆకుల రాంబాబు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మధుమేహం గురించి లయన్స్‌క్లబ్ అవగాహన కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని అన్నారు. మనిషికి డయాబెటిస్ వ్యాధితోనే అన్ని వ్యాధులు వస్తాయన్నారు. సమయానుకూలంగా ఆహరం తీసుకోవాలన్నారు. 35 నుంచి 40 ఏళ్ల యువతకు గుండె జబ్బులు, ఇతర వ్యాధులు రావడానికి డయాబెటీస్ వ్యాధియే కారణమన్నారు. కార్యక్రమంలో లయన్‌న్స్‌క్లబ్ జిల్లా డయాబెటీస్ కార్యదర్శి డాక్టర్ కె.అనంతరెడ్డి, జిల్లా కార్యదర్శి ఎస్.జగన్ మోహన్ రెడ్డి, రాంబాబు, జోన్ చైర్మన్ రామకృష్ణ, ఎంపీఓ అశోక్, లయన్స్‌క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు అల్లే శ్రీకాంత్, జీఆర్ మధుసూదన్ రెడ్డి, కోశాధికారి జి.సంతోష్, సభ్యులు ఆర్.ప్రదీప్‌గౌడ్, పి.సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ భూములను పరిరక్షించాలి
జిన్నారం (పటాన్‌చెరు): జిన్నారం మండలం గడ్డపోతారం గ్రామపంచాయతీ పరిధిలోని కిష్టయ్య పల్లి గ్రామంలో నెలకొన్న భూ వివాద సమస్యను ట్రైనీ కలెక్టర్ మనోజ్ కుమార్ మంగళవారం పరిశీలించారు. స్థానికుల ఫిర్యాదు మేరకు సర్వే నంబర్ 166లో భూములను పర్యవేక్షించారు. ప్రభుత్వ భూముల పరిరక్షణకు అధికారులు సత్వర చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దార్ భిక్షపతి, ఆర్‌ఐ జయప్రకాష్ నారాయణ, మాజీ సర్పంచ్ ప్రకాశం చారి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment