విద్యాబోధనలో నిర్లక్ష్యం వద్దు
నారాయణఖేడ్: విద్యార్థులకు విద్యాబోధనతో పాటు వసతి, భోజన విషయాల్లో నిర్లక్ష్యం వహించకూడదని ఎమ్మెల్యే సంజీవరెడ్డి ఉపాధ్యాయులకు సూచించారు. మంగళవారం నిజాంపేట మండలం బాచేపల్లిలోని మహాత్మా జ్యోతిబాపూలే బీసీ గురుకులాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. తరగతి గదుల్లో శుభ్రత, కూరగాయలు, సరకులను పరిశీలించారు. విద్యాబోధన, భోజన, వసతి, తాగునీరు తదితర సదుపాయాలను గురించి విద్యార్థినిలను అడిగి తెలుసుకున్నారు. 8వ తరగతి విద్యార్థినిలను గణిత శాస్త్రంకు సంబంధించి పలు ప్రశ్నలు అడిగారు. సరైన సమాధానాలు చెప్పడంతో వారిని మెచ్చుకున్నారు. కాగా, సిర్గాపూర్ మండలం బొక్కస్ గ్రామానికి చెందిన జ్ఞానోబారావు, కమ్మరి బ్రహ్మయ్యలకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన ఆర్ధిక సహాయానికి సంబంధించిన చెక్కులను నారాయణఖేడ్‌లోని తన నివాస గృహంలో అందజేశారు. ఎమ్మెల్యే వెంట ప్రజాప్రతినిధులు, నాయకులైన శంకర్ గౌడ్, యాదవరెడ్డి, పండరిరెడ్డి, రాధాకిషన్, శ్రీకాంత్, శివకుమార్ తదితరులు ఉన్నారు.
ఎమ్మెల్యే సంజీవరెడ్డి
గురుకుల పాఠశాల తనిఖీ
Comments
Please login to add a commentAdd a comment