ప్రతిభకు పురస్కారం
జడల చంద్రమ్మ, దీపికరెడ్డిలకు ఇందిరాగాంధీ అవార్డు అందజేత
ఝరాసంగం(జహీరాబాద్)/జోగిపేట(అందోల్): జిల్లాకు చెందిన ఇద్దరు మహిళా రైతులకు ఇందిరాగాంధీ ప్రతిభ పురస్కార అవార్డు దక్కింది. రాష్ట్ర ప్రభుత్వ విజయోత్సవాల సందర్భంగా వ్యవసాయంలో విశేష సేవలు అందిస్తున్న వారికి ఈ పురస్కారాలను అందజేసింది. ఝరాసంగం మండల పరిధిలోని బిడె కన్నె గ్రామానికి చెందిన రైతు జడల చంద్రమ్మ డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ సహకారంతో చిరుధాన్య పంటలను సాగు చేస్తుండటంతో ఈ అవార్డుకు ఎంపికై ంది. అలాగే.. సమగ్ర వ్యవసాయ రంగంలో విశిష్ట కృషి చేస్తున్న జోగిపేటకు చెందిన మహిళా రైతు దీపిక కూడా అవార్డు అందుకున్నారు. హైదరాబాద్లో వీరిద్దరికి ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అవార్డు అందించారు.
Comments
Please login to add a commentAdd a comment