బొల్లారం కమిషనర్‌కు కూడా..
జిన్నారం(పటాన్చెరు): జాతీయ సఫాయి కర్మచారి కమిషన్ నుంచి సంగారెడ్డి కలెక్టర్ వల్లూరు క్రాంతికి, బొల్లారం మున్సిపల్ కమిషనర్ మంగతాయారుకు నోటీసులు వచ్చాయి. ఇటీవల బొల్లారం మున్సిపాలిటీ పరిధిలో సవ్య కర్మచారి నర్సింహ విధినిర్వహణలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వీరికి నోటీసులు జారీ అయ్యాయి. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని నోటీసులో కమిషన్ కార్యదర్శి రాహుల్ కశ్యప్ సూచించారు. ఎస్సీ ఎస్టీ చట్టం ప్రకారం కేసులు నమోదు చేయాలని కోరారు. కార్మికుడి మృతికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. మృతి చెందిన కార్మిక కుటుంబాన్ని ఆదుకోవాలని పేర్కొన్నారు. సోషల్ వర్కర్ షాబుద్దీన్ అనే వ్యక్తి కమిషన్ దృష్టికి తీసుకువెళ్లడంతో ఈ నోటీసులు జారీ అయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment