జాతీయ స్థాయి జట్టుకు రాయికోడ్ విద్యార్థి
రాయికోడ్(అందోల్): రాయికోడ్‌లోని జెడ్‌పీహెచ్‌ఎస్‌లో ఎనిమిదవ తరగతి చదువుతున్న విద్యార్థి హన్మంతు జాతీయ స్థాయి అండర్ 14 వాలీబాల్ జట్టుకు ఎంపిక అయినట్టు మండల విద్యాధికారి వి.అంజయ్య తెలిపారు. మంగళవారం పాఠశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో విద్యార్థి ఎంపిక, ఆటలో మెలకువలు నేర్పిన ఫిజికల్ డైరెక్టర్ జ్యోతిని సన్మానించారు. వచ్చే నెలలో ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం వారణాసిలో ‘స్కూల్ గేమ్స్ ఫెడరేషన్’ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి అండర్ 14 వాలీబాల్ పోటీలు నిర్వహిస్తారన్నారు. ఈ సందర్భంగా విద్యార్థి హన్మంతును అభినందించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఖైరత్ అలీ, వినోద, అనంత్‌రావ్, కోటేశ్వర్,వేణు, శ్రావణ్‌కుమార్, సునంద, శోభారా ణి, నాగరాణి, శివలక్ష్మి, ప్రతిభ పాల్గొన్నారు.
ఎక్కువ సంఖ్యలో
కేసులను పరిష్కరించాలి
జిల్లా ప్రధాన న్యాయమూర్తి భవాని చంద్ర
సంగారెడ్డి టౌన్: రాజీమార్గంతో ఎక్కువ సంఖ్యలో కేసులను పరిష్కరించుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి భవాని చంద్ర అన్నారు. మంగళవారం జిల్లా కోర్టులో న్యాయవాదులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. క్రిమినల్, ఎకై ్సజ్‌కు సంబంధించిన కేసులను రాజీమార్గాన కక్షిదారులతో మాట్లాడి తొందరగా కేసులను పరిష్కరించాలని కోరారు. ప్రతి పోలీస్ స్టేషన్ వారిగా ఎక్కువ సంఖ్యలో కేసులను పరిష్కరించి కక్షిదారులకు ఇబ్బంది లేకుండా చేయాలన్నారు. సివిల్ , కుటుంబ కేసులు ఎక్కువ సంఖ్యలో పరిష్కారించాలని చెప్పారు. డిసెంబర్ 14న నిర్వహించే జాతీయా లోక్ అదాలత్ను విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో మొదటి అదనపు జిల్లా జడ్జి జయంతి, మూడవ అదనపు జిల్లా జడ్జి సునీతారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా మహిళా దినోత్సవం
సంగారెడ్డి: జిల్లా కేంద్ర గ్రంథాలయంలో మంగళవారం 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా ఆరవ రోజూ మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. భారత తొలి మహిళా ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వివిధ రకాల పోటీలు నిర్వహించారు. నేడు వారోత్సవాల ముగింపు పురస్కరించుకొని వారం రోజుల పాటు వివిధ అంశాల వారీగా నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతి అందజేస్తామని గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు అంజయ్య తెలిపారు. కార్య క్రమంలో సంస్థ కార్యదర్శి వసుంధర, డిప్యూటీ గ్రంథపాలకులు వంశీకృష్ణ, సహాయ గ్రంథపాలకులు ఆర్.శ్రీనివాస్, ప్రశాంత్‌కుమార్, సిబ్బంది వరలక్ష్మి, సావిత్రి, మంజుల, కష్ణమూర్తి పాల్గొన్నారు.
ఇన్‌స్పైర్ ప్రదర్శనకు
ధనసిరి విద్యార్థి ఎంపిక
జహీరాబాద్ టౌన్: జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో నిర్వహించనున్న ఇన్‌స్పైయిర్ జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన మొగుడంపల్లి మండల ధనసిరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి మల్లికార్జున్ రూపొందించి కలుపుతీత యంత్రం నమూనా ఎంపికై నట్లు హెచ్‌ఎం రమేశ్‌కుమార్ తెలిపారు. 2023–24 సంవత్సరానికి గాను 21 నుంచి 23 వరకు సంగారెడ్డిలో ఇన్‌స్పైర్ వైజ్ఞానికి ప్రదర్శన ఉందన్నారు. ఈ మేరకు హెచ్‌ఎం రమేశ్ కుమార్, ఉపాధ్యాయులు మల్లయ్య స్వామి, చంద్రశేఖర్, శామయ్య, పరమేశ్వర్, సిద్ధప్ప, మంజుల, మహేశ్ విద్యార్థిని అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment