No Headline
హుస్నాబాద్, అక్కన్నపేట మండలాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో 9 కేంద్రాలను ప్రారంభించగా మంచీళ్లబండ గ్రామాల్లో ఇప్పటి వరకు ధాన్యం సేకరణ జరుగలేదు. మిగితా 8 కేంద్రాల నుంచి 249 మంది రైతుల నుంచి 11,378 క్వింటాళ్ల ధాన్యం సేకరించారు. సివిల్ సప్లయ్ ఆధ్వర్యంలో రెండు మండలాల్లో 27 కేంద్రాలను ఏర్పాటు 119 మంది రైతుల నుంచి 54,635 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేసినట్లు నిర్వాహకులు చెబుతున్నారు. గత ఖరీఫ్ సీజన్‌కు 1.10 క్వింటాళ్ల ధాన్యం సేకరించారు. ఐకేపీ ఆధ్వర్యంలో గత ఖరీఫ్ సీజన్‌కు 32 వేల క్వింటాళ్ల ధాన్యం సేకరించగా ఈసారి 11,378 క్వింటాళ్ల ధాన్యమే సేకరించారు. అందులో మంచీళ్ల బండ గ్రామంలో ధాన్యం సేకరణ జరగలేదు. కేశ్వాపూర్, మీర్జాపూర్, మంచీళ్లబండ, టేకుల తండా, మల్లంపల్లి, యాటకార్ల పల్లె గ్రామాల నుంచి నిత్యం 10 వ్యాన్లలో పచ్చి ధాన్యం సేకరించిన వ్యాపారులు ఆంధ్రా, మహారాష్ట్ర, కర్నాటకకు తరలిస్తున్నారు. ప్రైవేటు వ్యాపారులు ధాన్యం మొదట ఇచ్చిన రైతులకు డబ్బులు చెల్లించి చివరకు మిగిలిన రైతులకు డబ్బులను ఎగవేస్తారు.
కొనుగోళ్లలోనూ కోత పెడుతూ..
అక్కన్నపేట, హుస్నాబాద్ మండలాల్లో వ్యాపారులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు పోటీగా వాళ్ల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. రైతుల పంట చేను వద్దకే వెళ్లి ధాన్యం సేకరిస్తున్నారు. ఒక క్వింటాల్‌కు రూ.1,910 కొనుగోలు చేయడంతోపాటు 40 కిలోల బస్తాకు సంచి కిలో, మట్టి కిలో కోత పెడుతున్నారు. ధాన్యం కొనుగోలు చేసి వ్యాపారులు రైతులకు నగదు జమ చేయడానికి 15 నుంచి 20 రోజుల గడువు పెడుతున్నారు. రైతుల వద్ద ధాన్యం ప్రైవేటు వ్యాపారులు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలకే కొనుగోలు చేయాల్సి ఉన్నప్పటికీ మార్కెట్ అధికారులు, రెవెన్యూ అధికారులు ప్రైవేటు వ్యాపారులపై చర్యలు తీసుకోకపోవడంతో విచ్చలవిడిగా ధాన్యం సేకరించి ఆంధ్రాకు తరలిస్తున్నట్లు సమాచారం.
ప్రభుత్వంపై నమ్మకం లేక..
ప్రభుత్వము రైతు భరోసా డబ్బులు వేయకపోవడం, రుణమాఫీ పూర్తిగా చేయకపోవడంతో ధాన్యం డబ్బులు సైతం సకాలంలో ఇయ్యదనే అపోహ రైతుల్లో నెలకొంది. ధాన్యం అరబెట్టేందుకు ఇబ్బందులు పడటం చూసిన వ్యాపారులు ఈ దందాకు తెరలేపినట్లు సమాచారం ప్రభుత్వము కొనుగోలు కేంద్రాల్లో రూ.2,330లకు కొనుగోలు చేస్తున్నా అక్కడ ధాన్యం అరబెట్టే సౌకర్యాలు లేకపోవడం, తూకం వేసే సమయంలో తేమ శాతం సమస్యలు రైతులను దళారుల వైపు మల్లిస్తున్నాయి. అధికారులు స్పందించి గ్యారంటీ లేని ప్రైవేటు వ్యాపారులను కట్టడి చేయకపోతే రైతులు మోసపోయే ప్రమాదం ఉందని ఆయా గ్రామాల నాయకులు అభిప్రాయపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment