పల్లెలో ధాన్యం దళారుల పాలవుతుంది. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు అన్నదాత తిప్పలు పడుతున్నాడు. చీడపీడలు, ప్రకృతి వైపరీత్యాల నుంచి పంటను కాపాడుకొని కొనుగోలు కేంద్రాలకు తీసుకొస్తే అక్కడ నిరాశే ఎదురవుతోంది. తేమశాతం, తాలు పేరిట తూకంలో కోత.. హమాలీలు, లారీల కొరత, డబ్బులు త్వరగా ఖాతాలో జమకాకపోవడం వంటి సమస్యలతో సతమతమవుతున్నారు. దీనిని ఆసరాగా చేసుకున్న కొందరు దళారులు పొలం వద్దకే వచ్చి రైతుల నుంచి పచ్చి వడ్లను కొంటున్నారు. – హుస్నాబాద్‌రూరల్
రైతుల వద్ద పచ్చి వడ్లు కొనుగోలు
● నిత్యం వ్యాన్లలో ధాన్యం సేకరణ ●
● ఏపీ, మహారాష్ట్ర, కర్నాటకకు తరలింపు
● ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు వసతులు కరువు
● తప్పక మధ్యవర్తులకు అమ్ముతున్న వైనం
● తేమ సాకుతో తక్కువ ధరకే విక్రయం
Comments
Please login to add a commentAdd a comment