మందుబాబులకు జరిమానా
సిద్దిపేటకమాన్: మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడిన వాహనదారులకు సిద్దిపేట కోర్టు జరిమానా, ఒకరికి జైలు శిక్ష విధించింది. ట్రాఫిక్ సీఐ ప్రవీణ్‌కుమార్ కథనం మేరకు.. పట్టణంలోని పలు ప్రాంతాల్లో తమ సిబ్బందితో కలిసి ఐదు రోజుల కిందట నిర్వహించిన వాహన తనిఖీల్లో ఏడుగురు పట్టుబడ్డారు. వారిని సిద్దిపేట కోర్టులో బుధవారం హాజరుపర్చగా విచారణ జరిపిన న్యాయమూర్తి రూ.12 వేలు జరిమానా, ఒకరికి మూడు రోజుల జైలు శిక్ష విధించినట్లు సీఐ తెలిపారు.
గంజాయి తరలిస్తున్న
ముగ్గురు అరెస్ట్
నర్సాపూర్ రూరల్: గంజాయి విక్రయించడంతోపాటు ఇతర గ్రామాలకు తరలిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు నర్సాపూర్ ఎకై ్సజ్ సీఐ పద్మ తెలిపారు. ఎకై ్సజ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. నర్సాపూర్ పట్టణానికి చెందిన మహమ్మద్ షాజిద్ ఖాన్ గంజాయి విక్రయించడంతోపాటు ఇతర గ్రామాలకు తరలిస్తున్నట్లు సమాచారం అందింది. బుధవారం నర్సాపూర్–హైదరాబాద్ జాతీయ రహదారి అర్బన్ పార్క్ సమీపంలో గంజాయి తరలిస్తుండగా స్కూటీతోపాటు షాజీద్ ఖాన్‌ను అరెస్టు చేసి 104 గ్రాముల ఎండు గంజాయిని స్వాధీ నం చేసుకున్నాం. ఈ మేరకు కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు. ఎకై ్సజ్ ఎస్‌ఐ అరుణ సిబ్బంది పాల్గొన్నారు.
లారీలో తరలిస్తున్న ఇద్దరు..
చేగుంట(తూప్రాన్): లారీలో ఎండు గంజాయి తరలిస్తున్న వ్యక్తులను అరెస్టు చేసినట్లు ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ టాస్క్‌ఫోర్స్ సీఐ నరేందర్ తెలిపారు. ఆయన కథనం మేరకు.. మండలంలోని వడియారం శివారులో జాతీయ రహదారిపై లారీలో గంజాయి తరలిస్తున్న బుధవారం సమాచారం అందింది. ఈ మేరకు లారీని పట్టుకోగా 725 గ్రాముల ఎండు గంజాయి లభ్యమైంది. వెస్ట్ బెంగాల్ నుంచి గుర్తు తెలియని వ్యక్తి పంపిస్తున్న గంజాయిని అంజరూల్, షేక్ రహీం దొంగచాటుగా రవాణా చేస్తున్నట్లు గుర్తించామని తెలిపారు. పంచనామా నిర్వహించి గంజాయితోపాటు 2 సెల్‌ఫోన్లు, లారీని స్వాధీనం చేసుకొని నిందితులను అరెస్టు చేసినట్లు సీఐ తెలిపారు.
విక్రేతలను అదుపులోకి తీసుకొని కౌన్సిలింగ్
చిన్నశంకరంపేట(మెదక్): గంజాయి నిర్మూలనకు చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని పారిశ్రామికవాడలో తనిఖీలు నిర్వహించిన ఎ కై ్సజ్ టాస్క్‌ఫోర్స్‌మెంట్ బృందం ఇద్దరు వినియోగదారులను అదుపులోకి తీసుకొని కౌన్సిలింగ్ ఇచ్చారు. బుధవారం అర్థరాత్రి ఎకై ్సజ్ టాస్క్‌ఫోర్స్ సీఐ నరేందర్‌గౌడ్ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు నిర్వహించి ఇద్దరు వినియోగదారులను అదుపులోకి తీసుకున్నారు. మీర్జాపల్లి రోడ్డులోని పరిశ్రమలో పని చేసే కార్మికులు గంజాయి కొనుగోలు చేసినట్లు గుర్తించారు.
Comments
Please login to add a commentAdd a comment