క్రీస్తు బోధనలు అనుసరణీయం
ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి
పటాన్‌చెరు: క్రీస్తు బోధనలు, జీవితం ప్రతీ ఒక్కరికి అనుసరణీయమని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి పేర్కొన్నారు. క్రిస్మస్ పర్వదినం పురస్కరించుకుని పటాన్‌చెరు మండలం పాటిగ్రామ చౌరస్తాలో గల మరనాత చర్చిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ప్రపంచవ్యాప్తంగా అతి పెద్ద పండుగ క్రిస్మస్ అన్నారు. విశ్వ శాంతి దూత, దేవుని కుమారుడు భూమి మీద అడుగు పెట్టిన శుభదినం చెప్పారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయకుమార్, సీనియర్ నాయకులు వెంకటేశ్, ధనరాజ్, చర్చి నిర్వాహకులు భాస్కర్‌రావు తదితరులు పాల్గొన్నారు.
క్రిస్మస్ వేడుకల్లో
ఎమ్మెల్యే మాణిక్‌రావు
జహీరాబాద్ టౌన్: జహీరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో క్రిస్మస్ వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని మెథడిస్ట్ సెంట్రల్ చర్చికు క్రైస్తవులు తరలివచ్చి ప్రార్థనలు చేశారు. క్రీస్తు బోధనలను క్రైస్తవ మత పెద్దలు వివరించారు. ఎమ్మెల్యే కె.మాణిక్‌రావు, డీసీఎంఎస్ ఉమ్మడి మెదక్ జిల్లా చైర్మన్ ఎం.శివకుమార్ తదితరులు సెంట్రల్ చర్చికి వచ్చి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.
అతిథి అధ్యాపకుల కోసం
దరఖాస్తుల ఆహ్వానం
నారాయణఖేడ్: అందోల్‌లోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల, కళాశాలలో అతిథి అధ్యాపకులుగా పనిచేసేందుకు అర్హులైన మహిళల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ లింగారెడ్డి తెలిపారు. బోటనీ సబ్జెక్టు కోసం జూనియర్ అధ్యాపకురాలు, ఇంగ్లిష్, గణితం, తెలుగు బోధనకు పీజీటీ, ఫిజిక్స్, మ్యాథ్స్, తెలుగు, బయోలజీ, సోషల్ సైన్స్ బోధించేందుకు టీజీటీ పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. అర్హత కలిగిన మహిళా అభ్యర్థులు ఈ నెల 27న అందోల్ గురుకులంలో నిర్వహించనున్న డెమో తరగతులకు ధ్రువపత్రాలతో హాజరుకావాలని సూచించారు.
దేశభక్తి, క్రమశిక్షణకు
వేదికగా సీఏటీసీ
ఐఐటీహెచ్ డాక్టర్ దిగ్విజయ్ పవార్
సంగారెడ్డి జోన్: దేశభక్తి, క్రమశిక్షణకు 8వ సంయుక్త వార్షిక శిక్షణ శిబిరం (సీఏటీసీ) ఓ మంచి వేదికగా నిలుస్తుందని ఎఫ్‌ఐసీ ఎన్‌సీసీ, ఐఐటీహెచ్ డాక్టర్ దిగ్విజయ్ పవార్ పేర్కొన్నారు. సంగారెడ్డి 33వ తెలంగాణ యూనిట్ ఆధ్వర్యంలో ఐఐటీ హైదరాబాద్‌లో ఈ నెల 21 నుంచి 30వ తేదీ వరకు ఈ శిబిరం కొనసాగనుంది. ఈ శిబిరానికి 33వ తెలంగాణ యూనిట్ కమాండింగ్ అధికారి లెఫ్టినెంట్ కల్నల్ రమేశ్ సారియాల్ నేతృత్వం వహిస్తున్నారు. పది రోజుల పాటు జరగనున్న శిబిరంలో మొత్తం 400 మంది క్యాడెట్లు హాజరయ్యారు. ఈ శిబిరంలో పరేడ్, శారీరక దారుఢ్యం, తుపాకీ వినియోగం, వ్యక్తిత్వ వికాస శిక్షణ వంటి కార్యక్రమాలు నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment