ఘనంగా క్రిస్మస్ వేడుకలు
కంది(సంగారెడ్డి): కంది మండల కేంద్రమైన కందిలోని రాక్ చర్చలో క్రిస్మస్ సంబరాలు ఘనంగా జరిగాయి. చర్చిలో ఉదయం నుంచి భక్తుల సందడి నెలకొంది. క్రిస్మస్ సందర్భంగా చర్చి ఫాదర్ ఏసుపాల్ దైవసందేశాన్ని వినిపించారు. గ్రామాల్లోని అన్ని చర్చిలను విద్యుద్దీపాలతో అందంగా అలంకరించారు. క్రిస్మస్ ట్రీలను ఏర్పాటు చేశారు. యేసుక్రీస్తు పుట్టుకపై చిన్నారులు ప్రదర్శించిన నాటికలు,సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. క్రిస్మస్ వేడుకలకు డీఆర్వో పద్మజారాణి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు తోపాజి అనంత కిషన్ క్రిస్మస్ హాజరై శుభాకాంక్షలు తెలిపారు.
సదాశివపేటలో...
సదాశివపేట(సంగారెడ్డి): సదాశివపేట పట్టణ పరిధిలోని చర్చిల్లో బుధవారం క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని సీఎస్‌ఐ చర్చి సామూహిక ప్రార్థనలు చేశారు. రాఘవేంద్రనగర్ కాలనీలో ప్రేమస్వరూపి మినిస్ట్రీస్ చర్చిలో పాస్టర్ డేనియల్‌రాజు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు.
సంగారెడ్డి టౌన్‌లో...
సంగారెడ్డిటౌన్: క్రిస్మస్ వేడుకలను పురస్కరించుకుని సంగారెడ్డి మండలంలోని పలు గ్రామాల్లో క్రిస్మస్‌ను ఘనంగా నిర్వహించారు. క్రీస్తు జన్మదినం సందర్భంగా గ్రామాల్లోని చర్చిలను విద్యుద్దీపాలతో అలంకరించి క్రిస్మస్ ట్రీలను ఏర్పాటు చేశారు. చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో క్రైస్తవులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment