పరిశ్రమల సహకారం అభినందనీయం
పటాన్చెరు: గ్రామాల అభివృద్ధిలో పరిశ్రమలు భాగస్వాములు కావడం అభినందనీయమని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి పేర్కొన్నారు. పటాన్చెరు మండలం రుద్రారం గ్రామ పరిధిలో తోషిబా పరిశ్రమ సహకారంతో రూ.1.68 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన పల్లె దవాఖాన భవనం, మూడు ఆర్వో ప్లాంట్లను ఆయన గురువారం ప్రారంభించారు. అనంతరం రూ.60 లక్షలు గ్రామపంచాయతీ నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ...గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలన్న సమున్నత లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పల్లె దవాఖానాలు ఏర్పాటు చేస్తుందని తెలిపారు. ప్రతీ పల్లె దవాఖానాలో వైద్యుడితోపాటు ప్రాథమిక వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. భవిష్యత్తులోనూ గ్రామాభివృద్ధికి తోషిబా సంస్థ సంపూర్ణ సహకారం అందించాలని కోరారు. కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ సుధీర్‌రెడ్డి, పీఎసీఎస్ చైర్మన్ పాండు, మండల పంచాయతీ అధికారి హరిశంకర్‌గౌడ్, మాజీ ఎంపీటీసీలు హరిప్రసాద్‌రెడ్డి, రాజు, వెంకన్న, తోషిబా సంస్థ ప్రతినిధి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
గ్రామాల అభివృద్ధిపై ఎమ్మెల్యే గూడెం
రుద్రారం గ్రామంలో రూ.1.68 కోట్లఅభివృద్ధి పనులకు శ్రీకారం
Comments
Please login to add a commentAdd a comment