అప్రమత్తతతో నేరాల నియంత్రణ
సంగారెడ్డి జోన్: సమాజంలో జరుగుతున్న నేరాల నియంత్రణకు పోలీసు శాఖ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటుందని జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ అన్నారు. శుక్రవారం తన కార్యాలయంలో వార్షిక వార్షిఖ నివేదికను వెల్లడించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా 2023 సంవత్సరంలో 7,236 కేసులు నమోదు కాగా 2024 సంవత్సరంలో 7,563 కేసులు నమోదైనట్లు తెలిపారు. రోడ్డు ప్రమాదాలలో 384 మంది మృతి చెందగా.. 913 మంది గాయాలపాలయ్యారని పేర్కొన్నారు. రాష్ట్ర సరిహద్దు నుంచి అక్రమ గంజాయి రవాణాను అడ్డుకునేందుకు జిల్లాలో ప్రత్యేకంగా స్పెషల్ యాంటీ నార్కోటిక్ సెల్‌ను ఏర్పాటు చేశామన్నారు. సైబర్ నేరాల నుంచి ప్రజలకు విముక్తి కల్పించేందుకు డీఎస్పీ స్థాయిలో సైబర్ సెల్ బ్యూరో నియమించామని, అత్యవసర, ఆపద సమయాల్లో వచ్చిన ఫోన్ కాల్స్ 70058, డైల్ 100 కాల్స్‌కు సుమారు 8 నిమిషాల వ్యవధిలో సంఘటన స్థలానికి చేరుకుని, నేరాల తీవ్రతను తగ్గించామన్నారు. నేరాలను ఛేదించడానికి జిల్లావ్యాప్తంగా 739 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామన్నారు. గతేడాది మార్చిలో ప్రారంభించిన సీఈఐఆర్ పోర్టల్ ద్వారా ఈ సంవత్సరం జనవరి నుంచి ఇప్పటి వరకు వచ్చిన 5,111 దరఖాస్తులలో 2,512 సెల్‌ఫోన్‌లను ట్రేస్ చేసి, 971 సెల్‌ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అప్పగించామని ఆయన తెలిపారు. బాల నేరస్తులు పోలీస్ స్టేషన్ కు వచ్చిన సమయంలో ఒక ఫ్రెండ్లీ నేచర్ కనిపించే విధంగా జిల్లాలో ఎనిమిది పోలీస్ స్టేషన్‌లో చైల్డ్ ఫ్రెండ్లీ కార్నర్లను ప్రారంభించామని తెలిపారు. సమావేశంలో అడిషనల్ ఎస్పీ సంజీవరావు, డీఎస్పీలు సత్తయ్య గౌడ్, రామ్మోహన్ రెడ్డి, రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఈ ఏడాది 7,563 కేసులు నమోదు:
ఎనిమిది ఠాణాల్లో చైల్డ్ ఫ్రెండ్లీ కార్నర్లు
వార్షిక నివేదికను వెల్లడించిన ఎస్పీ
Comments
Please login to add a commentAdd a comment