మన్మోహన్ గొప్ప ఆర్థిక సంస్కర్త
సంగారెడ్డి జోన్: కాంగ్రెస్ అగ్రనేత, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ మృతి దేశానికి తీరని లోటని ఆ పార్టీ జిల్లా అధ్యక్షురాలు, టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మలారెడ్డి అన్నారు. శుక్రవారం సంగారెడ్డి పట్టణంలో పార్టీ నాయకులతో కలసి మన్మోహన్‌సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దేశం ఒక్క గొప్ప నాయకున్ని కోల్పోయిందని చెప్పారు. మన్మోహన్‌సింగ్ ఎన్నో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి దేశాన్ని ముందుకు నడిపించారని కితాబిచ్చారు. పనికి ఆహారపథకం, ఆధార్, ఆర్టీఐ, విద్యాచట్టం, ఇలా అనేక సంస్కరణలు తీసుకొచ్చారని గుర్తుచేశారు. కార్యక్రమంలో సీడీసీ చైర్మన్ రాంరెడ్డి, గ్రంథాలయ మాజీ చైర్మన్ తోపాజి అనంత కిషన్, కాంగ్రెస్ నాయకులు కూన సంతోష్ గౌడ్, మహేష్, శ్రీకాంత్ గౌడ్, సదాశివపేట పార్టీ అధ్యక్షుడు సిద్దన్న, కౌన్సిలర్లు నాగరాజ్, సోహేల్, కసిని రాజు, చిత్తరి యాదగిరి, శ్రీనివాస్ పాల్గొన్నారు.
డీసీసీ అధ్యక్షురాలు నిర్మలారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment