రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం
బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి ఈ ఏడాది జూలైలో ఆ పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరడం రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపింది. అక్రమ మైనింగ్ కేసు, ప్రభుత్వ భూముల కబ్జాల విషయంలో పలు ఆరోపణలు ఎదుర్కొన్న మహిపాల్‌రెడ్డిపై ఇటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కూడా కేసు నమోదు చేసింది. ఈ క్రమంలోనే ఆయన బీజేపీలో చేరుతారనే ప్రచారం జరిగినప్పటికీ, కాంగ్రెస్ పార్టీలో చేరడం చర్చనీయాంశంగా మారింది. ఆయన బాటలోనే జిల్లాకు చెందిన పలువురు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారుతారనే ప్రచారం జరిగింది. ప్రొటోకాల్ సమస్యను పరిష్కరించాలని కోరతూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు మాణిక్‌రావు, చింతా ప్రభాకర్, సునీతారెడ్డి, కొత్త ప్రభాకర్‌రెడ్డిలు సైతం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలవడం అప్పట్లో కలకలం రేపింది.
Comments
Please login to add a commentAdd a comment