![ఎంవోయూలతో ఆర్థికవ్యవస్థ బలోపేతం](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2024/12/27/26zhr77-350063_mr-1735268168-0.jpg.webp?itok=4oRAK-UV)
ఎంవోయూలతో ఆర్థికవ్యవస్థ బలోపేతం
సంగారెడ్డి జోన్: విద్య, పారిశ్రామిక రంగాల్లో పరస్పర సహకారానికి హైదరాబాద్‌లోని ఐఐటీ–జపాన్‌లోని హమామత్సునగర మేయర్‌ల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ మేరకు అవగాహన ఒప్పంద పత్రంపై కందిలోని ఐఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ బీఎస్ మూర్తి, జపాన్‌లోని హమామత్సు నగర మేయర్ యూసుకె నకనో గురువారం సంతకాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...అవగాహన ఒప్పందాలు చేసుకోవడం ద్వారా ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు, ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతమవుతాయన్నారు. ఇరు దేశాల మధ్య మానవ వనరుల మార్పిడి, బహిర్గత ఆవిష్కరణల ద్వారా విద్యా, పారిశ్రామిక రంగాల్లో అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. హమామత్సులో భారతీయుల సాంకేతిక నైపుణ్యాలను మరింత మెరుగుదిద్దేందుకు ఈ అవగాహన ఒప్పందం ఎంతగానో తోడ్పడుతుందని చెప్పారు. మౌలిక వసతుల కల్పన, మానవ వనరుల పరస్పర మార్పిడి, పారిశ్రామిక రంగాల్లో పరిశోధన–అభివృద్ధి వంటి కీలక అంశాల్లో ఐఐటీ హైదరాబాద్ పెట్టుబడులు పెట్టడం ఇదే తొలిసారి అని పేర్కొన్నారు. ఇంజనీరింగ్ టెక్నాలజీ, అత్యుత్తమ ప్రతిభ పెంపొందించటంలో ఐఐటీ అంతర్జాతీయంగా ప్రశంసలు అందుకుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment