నేటి నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్
సంగారెడ్డి ఎడ్యుకేషన్: ఇంటర్మీడియెట్ ప్రాక్టికల్ పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 3 నుంచి 20వ తేదీ వరకు ప్రయోగ పరీక్షలు జరగనున్నాయి. ఈ ప్రాక్టికల్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఇంటర్ విద్యాశాఖ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. మాస్ కాపీయింగ్‌ను అరికట్టడంలో భాగంగా ఈసారి గతంలో ఎన్నడూలేని విధంగా ప్రాక్టికల్ పరీక్షలు సీసీ కెమెరాల పర్యవేక్షణలో నిర్వహించనున్నారు. ప్రైవేట్ కళాశాలలో విద్యార్థులకు ప్రాక్టికల్స్‌లో అత్యధిక మార్కులు వస్తున్నాయనే ఆరోపణలో నేపథ్యంలో ప్రభుత్వం సీసీ కెమెరాలను ఏర్పాటు చేసింది. ఈ సీసీ కెమెరాలను ఎగ్జామ్ బోర్డుకు అనుసంధానం చేశారు. పరీక్షలు నిర్వహించే తీరును అధికారులు ఇక్కడి నుంచే పర్యవేక్షించనున్నారు. మాస్ కాపీయింగ్‌కు పాల్పడినట్లు గుర్తిస్తే సంబంధిత కళాశాలల యాజమాన్యం చర్యలు తీసుకుంటారు.
ప్రతీ కళాశాలలో రెండు సీసీ కెమెరాలు
జిల్లాలో 20 ప్రభుత్వ కళాశాలలుండగా, 48 ప్రైవేట్, 63 ప్రభుత్వ రెసిడెన్షియల్ కళాశాలలున్నాయి. వీటిలో సుమారు 10 వేలమంది విద్యార్థులు ప్రాక్టికల్ పరీక్షలకు హాజరుకానున్నారు. ప్రాక్టికల్ పరీక్షల నేపథ్యంలో ప్రభుత్వ కళాశాలల్లో రెండు సీసీ కెమెరాల ఏర్పాటు కోసం ప్రభుత్వం రూ.12 వేలు విడుదల చేసింది. దీంతో ప్రతీ కళాశాలలో రెండు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ రెండు కెమెరాలలో ఒకటి ల్యాబ్ లోపల, మరో కెమెరాను ప్రవేశద్వారం దగ్గర ఏర్పాటు చేశారు. దీంతో ప్రయోగ పరీక్షల జరిగే సమయంలో వీడియోతోపాటు ఆడియో కూడా రికార్డవుతుంది.
ప్రశ్న పత్రాలు ఆన్‌లైన్‌లో...
ప్రాక్టికల్స్‌కు సంబంధించిన ప్రశ్న పత్రాలను ఏరోజుకారోజు ఇంటర్‌బోర్డు ఆన్‌లైన్‌లో పొందుపరచనుంది. ఈ ప్రశ్న పత్రాలకు సంబంధించి అరగంట ముందుగానే కళాశాల ప్రిన్సిపాల్ లాగిన్‌కు మెయిల్ వస్తుంది. దాని ప్రకారం ప్రశ్న పత్రాన్ని డౌన్‌లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ ప్రింట్ తీసుకున్న ప్రశ్న పత్రాన్ని విద్యార్థులకు అందజేస్తారు. ప్రశ్న పత్రాలను మాత్రమే సీసీ కెమెరా పర్యవేక్షణలో ఓపెన్ చేసేవారు. కాగా, ఈ ఏడాది ప్రయోగాలను కూడా సీసీ కెమెరాల పర్యవేక్షణలో చేయాల్సి ఉంటుంది.
అన్ని ఏర్పాట్లు పూర్తి
ప్రయోగ పరీక్షలకు సంబంధించి కళాశాలల్లో అన్ని ఏర్పాట్లను పూర్తి చేశాం. మాస్‌కాపీయింగ్‌కు పాల్పడే అవకాశం లేకుండా ప్రతీ ప్రభుత్వ కళాశాలలో రెండు సీసీ కెమెరాలను అమర్చాం. తప్పనిసరిగా సీసీ కెమెరాల పర్యవేక్షణలోనే విద్యార్థులు ప్రయోగాలు చేయాలి. –గోవిందరాం,
జిల్లా ఇంటర్మీడియెట్ అధికారి
ఈ నెల 20 వరకు ప్రయోగ పరీక్షలు
తొలిసారి సీసీ కెమెరాల పర్యవేక్షణలో...
ఏర్పాట్లు పూర్తి చేసిన ఇంటర్ విద్యాశాఖ
Comments
Please login to add a commentAdd a comment