కార్మికులను మోసం చేసిన కేంద్రం
సీపీఐ జిల్లా కార్యదర్శి తాజోద్దిన్ ధ్వజం
సదాశివపేట(సంగారెడ్డి): వికసిత్ భారత్ లక్ష్యంగా ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌లో కార్మికులు, కర్షకులు, పేదలను ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రభుత్వం దగా చేసిందని సీపీఐ జిల్లా కార్యదర్శి తాజోద్దిన్ విమర్శించారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం ఆయన మాట్లాడుతూ... వేతన జీవులకు ఊరట కల్పిస్తున్నామని చెప్పి కేంద్రం పేదలను దారుణంగా మోసం చేసిందన్నారు. దేశాన్ని అదానీ, అంబానీకి తాకట్టు పెడుతున్నారని ఆరోపించారు. తెలంగాణ లో బీజేపీ కేంద్రమంత్రులు ఇద్దరున్నా రాష్ట్రాభివృద్ధికి ఎలాంటి నిధులు రాబట్టలేనందున కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లు తమ పదవులకు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో శ్రామిక కార్యదర్శి అనసూజ, మహిళా నాయకులు బుజ్జమ్మ, ఊర్మిళ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment