మాజీమంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్
పటాన్‌చెరు టౌన్: జాతర్ల నిర్వహణతో గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం చోటు చేసుకుంటుందని మాజీమంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ పేర్కొన్నారు. పటాన్‌చెరు మండలం పెద్దకంజర్ల గ్రామ పరిధిలో ఆదివారం భ్రమరాంబిక సహిత మల్లికార్జున (గుండు మల్లన్న) జాతర మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నిర్వాహకులు తలసానిని ఘనంగా సన్మానించారు. మల్లన్న దేవాలయం వద్ద నూతనంగా నిర్మించిన కల్యాణ మండపాన్ని మాజీమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మల్లన్న ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్ర ప్రజల సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నానన్నారు. మల్లన్న స్వామిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని చెప్పారు. కార్యక్రమంలో రామచంద్రపురం కార్పొరేటర్ పుష్ప నాగేష్, జాతర నిర్వాహకులు శేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment