ప్రజావాణిపై నిర్లక్ష్యం తగదు
బీటీ రోడ్డు పనులు
వేగిరం చేయండి
సిద్దిపేటరూరల్ మండలం పుల్లూరు నుంచి రామంచ వరకు బీటీ రోడ్డు పనులు వేగిరం చేయాలని బీఎస్పీ ఆధ్వర్యంలో ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా బీఎస్పీ నియోజకవర్గ అధ్యక్షుడు ఉమేశ్ మాట్లాడుతూ బీటీ రోడ్డు నిర్మాణానికి రూ.3కోట్లు మంజూరైనప్పటికీ పనులు మాత్రం నామమాత్రంగా జరిగాయన్నారు. రాత్రి వేళలో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. వెంటనే అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు మల్లేశం ముదిరాజ్, అసెంబ్లీ ఇన్‌చార్జి పంగబాబు, అసెంబ్లీ ఉపాధ్యక్షుడు సంపత్, తదితరులు పాల్గొన్నారు.
సిద్దిపేటరూరల్: సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన ప్రజావాణిపై నిర్లక్ష్యం తగదని, జిల్లా అధికారులు, ఆయా శాఖలకు చెందిన సబార్డినేట్ లు తప్పకుండా హాజరు కావాలని కలెక్టర్ మిక్కిలినేని మనుచౌదరి అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్‌తో కలిసి కలెక్టర్ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా కేంద్రంతో పాటు వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు ఎన్నో వ్యయప్రయాసాలకు ఓర్చి ప్రజావాణికి వస్తారన్నారు. స్వీకరించిన ఫిర్యాదులపై అధికారులు సానుకూలంగా వ్యవహరించడంతో పాటు సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. అర్జీలను పెండింగ్‌లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరిపి పరిష్కరించాలన్నారు. ప్రజావాణికి జిల్లా స్థాయి అధికారులు తప్పకుండా హాజరు కావాలని, వారి శాఖలకు సంబంధించిన సబార్డినేట్లను ప్రజావాణికి పంపరాదన్నారు. సమయపాలన పాటించని అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. వివిధ సమస్యలపై ప్రజావాణికి మొత్త 48 అర్జీలు వచ్చాయి. కార్యక్రమంలో డీఆర్‌ఓ నాగ రాజమ్మ, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
అత్యాచారాలను అరికట్టండి
రోజురోజుకు దళితులపై పెరుగుతున్న అత్యాచారాలను అరికట్టాలని కోరుతూ దళిత బహుజన ఫ్రంట్ ఆధ్వర్యంలో ప్రజావాణిలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా డీబీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పులికల్పన మాట్లాడుతూ జిల్లా కేంద్రమైన సిద్దిపేటలో టీహెచ్‌ఆర్ నగర్‌కు చెందిన దళిత మహిళపై, మర్కుక్ మండలం ఎర్రవెల్లి , వర్గల్ మండలం మాదారం గ్రామాలకు చెందిన మహిళల అనుమానాదాస్పద మరణాలకు కారకులైన నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలన్నారు. నిందితులపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు. కార్యక్రమంలో డీబీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి స్వామి, జిల్లా ఉపాధ్యక్షుడు శేఖర్, ప్రధాన కార్యదర్శి వేణు తదితరులు పాల్గొన్నారు.
అధికారులందరూ హాజరుకావాలి
కలెక్టర్ మిక్కిలినేని మనుచౌదరి
సబార్డినేట్ల హాజరుపై కలెక్టర్ సీరియస్
Comments
Please login to add a commentAdd a comment